వాసిరెడ్డి పద్మకు ఐదేళ్ల పదవి కాలం ఇస్తూ మహిళా కమిషన్ చైర్మన్ గా నియమించారు. ఆ జీవో బహిరంగంగా ఇచ్చారు. కానీ తరవాత మహిళా కమిషన్ చైర్మన్ పదవిని రెండేళ్లకే పరిమితం చేస్తూ సవరణ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ జీవో రహస్యంగా ఉంచారు. దీంతో ఈ పదవి కాలం ఆమెకు మేలోనే పూర్తయింది. కానీ మహిళా కమిషన్ చైర్మన్ ని అంటూ ఆమె హడావుడి చేస్తూనే ఉన్నారు. తిరుగుతూనే ఉన్నారు. చివరికి పవన్ కల్యాణ్ కూ నోటీసులు జారీ చేశారు.
జగన్ రెడ్డి ఆమె పదవి కాలాన్ని ఎందుకు తగ్గించారో తెలియదు కానీ… ఆ విషయం ఆమెకు కూడా చెప్పకుండా అవమానించడం పై మాత్రం … వైసీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆమె సామాజికవర్గంపై జగన్ రెడ్డి ఇలానే కసి తీర్చుకుంటారని.. ఎవరి కోసం పని చేస్తుననారన్నది ఆయనకు సెకండరీ అనే సెటైర్లు వైసీపీలో వినిపిస్తున్నాయి. అయితే ఆమె జీవో ఇచ్చిన తర్వాత పదవి కాలం తగ్గిస్తూ జీవో ఇచ్చారు కాబట్టి ఆమె పదవి కాలం ఐదేళ్లు ఉంటుందని వాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి చట్టం తీసుకొస్తే .. ఇంతకు ముందు చేసిన నియామకాలకూ వర్తిస్తుందని… ఎస్ఈసీ విషయంలో ప్రభుత్వం వాదించింది.
ఒక వేళ… వాసిరెడ్డి పద్మ పదవి కాలం తగ్గించడానికి కాదని… ఆమె నియామకం ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వాదించదల్చుకుంటే.. ఇప్పుడు అసలు మహిళా కమిషన్ చైర్మన్ పదవిని రెండేళ్లకే పరిమితం చేస్తూ.. హఠాత్తుగా ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారన్నది ఇక్కడ కీలకం. ఆమె పదవి కోసం మరో రెండేళ్లకుపైగా ఉంది. వచ్చే ప్రభుత్వంలోనే అలాంటి జీవో ఇవ్వొచ్చు కదా అనేది అందరికీ వస్తున్న డౌట్. పదవి పోతే మాత్రం … వాసిరెడ్డి పద్మ పరువు మాత్రం వైసీపీలో కలిసిపోవడం ఖాయమవుతుంది. దీనిపై ప్రభుత్వ వివరణ రావాల్సి ఉంది.