పార్టీ మారిన వాళ్లను జగన్ రెడ్డి అసలు సహించరు. ఎంతగా అంటే భూమా నాగిరెడ్డి చనిపోతే అసెంబ్లీలో సంతాపం చెప్పడానికి కూడా రాలేదు. బంధుత్వం ఉన్నా పలకరింపులకూ పోలేదు. నక్సలైట్లు అరకు ఎమ్మెల్యే కిరాడి సర్వేశ్వరరావును చంపేస్తే.. పార్టీ మారినందుకు బాగా అయిందని సంతోషపడ్డ నైజం ఆయనది. అలాంటి ఘోరమైన తీరు ఉన్న ఆయన … రాజ్యసభ పదవికి రాజీనామా చేసి మరీ టీడీపీలో చేరిపోయిన మోపిదేవిని మాత్రం అన్నా.. అన్నా అంటున్నారు. ఎంతో చేశానని చాన్స్ వస్తే ఇంకా ఎంతో చేసేవాడిని రేపల్లె కార్యకర్తల ముందు చెప్పుకున్నారు.
జగన్ తీరు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. మోపిదేవిని జగన్ ఎందుకు అంత గౌరవిస్తున్నారో అనుకున్నారు. కానీ కస్త వెనక్కి తిరిగి చూస్తే… జగన్ అక్రమాస్తుల కేసుల్లో వాన్ పిక్ వ్యవహారం వెలుగులోకి వస్తుంది. ఇందులో మోపిదేవి సహ నిందితుడు. ఆయన జైలుకెళ్లాడు కూడా. ఆ కేసులకు సంబంధించి సహ నిందితుడిగా ఉన్న మోపిదేవి అప్రూవర్‌గా మారితే జగన్ ఇరుక్కోవడం ఖాయం.. అప్పట్లో పెట్టబడుల శాఖ మంత్రిగా పనిచేసిన మోపిదేవికి వాన్ పిక్ భూముల కేసులో లొసుగున్నీ తెలుసు… ఇప్పుడా భయాందోళనలతోనే జగన్ మోపిదేవిపై ప్రేమ నటిస్తున్నారని అంటున్నారు.
తండ్రి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ చేసిన క్విడ్ ప్రో కో వ్యవహారాల్లో అప్పటి మంత్రులు చాలా మంది నిందితులయ్యారు. వారు ఎలాంటి లాభం పొందలేదు . మొత్తం పెట్టుబడుల రూపంలో లంచాలు జగనే తీసుకున్నారు. కానీ మోపిదేవి లాంటి వాళ్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. రాజకీయ భవిష్యత్ కోసం తప్పనిసరిగా జగన్ పంచన చేరాల్సి వచ్చింది. ఓడిపోయినా మంత్రి పదవి ఇచ్చానని జగన్ డప్పు కొట్టుకుంటున్నారు కానీ.. మండలి రద్దు డ్రామా ఆడి ఆయన పదవిని వెంటనే తీసేశారు. దాన్ని మాత్రం చెప్పుకోరు.