వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి .. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రెండు సార్లు సమావేశం అయ్యారు. వారం వ్యవధిలో రెండు సార్లు అమిత్ షాతో భేటీ అయి.. ఆ ఫోటోలను గొప్పగా విడుదల చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు అమిత్ షాతో ఫోటోలు దిగడం చాలా అవసరం. అయితే.. ఎందుకు అమిత్ షా ఆ చాన్స్ ఇచ్చారన్నది ఢిల్లీలో ఆసక్తికరమైన చర్చలకు కారణం అవుతోంది.
వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి.. టీడీపీలో చేరి మళ్లీ ఆ పార్టీ తరపున గెలుస్తారని … సాక్షి మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి అది వైసీపీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీల్ని స్వయంగా బీజేపీలోకి పంపడానికి జగన్ చేస్తున్న రాజకీయంలో భాగంగానే ఈ ప్రచారం ప్రారంభించారని చెబుతున్నారు. ఆరుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడానికి అవసరమైన కసరత్తులో భాగంగానే విజయసాయిరెడ్డి అమిత్ షాను కలిశారని బీజేపీ వర్గాలు కూడాచెబుతున్నారు.
Read Also : ఆరుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీల రాజీనామా ?
ఐదారుగురు ఎంపీలకు బదులు జగన్ కొన్ని రాజకీయ ప్రయోజనాలు కోరుకున్నారని అందుతో మొదటిది తన కేసులు.. వివేకా హత్య కేసు స్టేటస్ కో ఉండేలా చూడాలని అంటున్నారు. అంటే.. కేసులు కదలకుండా ఉండాలని జగన్ మొదటి కోరక అంటున్నారు. అయితే బీజేపీ స్పందన ఏమిటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీకి రాజ్యసభ ఎంపీల అవసరం ఉంది . అయితే.. వైసీపీ తోక జాడించే అవకాశం లేదు. కానీ ఢిల్లీ ధర్నాతో.. ఇండియా కూటమి నేతల్ని పిలిపించుకున్న జగన్… తనకు ఆప్షన్ ఉందని బీజేపీని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. అందుకే.. బీజేపీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరం.