సోషల్ మీడియా సైకోలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. అలాంటి వారిలో 90 శాతం మంది ఒకే సామాజికవర్గానికి చెందిన వారు ఉంటున్నారు. వీరిలో సైకోతనాన్ని ఎక్కించి బూతులతో విరుచుకుపడేలా చేసింది జగన్ రెడ్డి రాజకీయం. వీరిలో అనేక మంది మంచి భవిష్యత్ కోసం కలలు కంటున్నవారు ఉన్నారు. ప్రయత్నాలు చేసుకుంటేూ ఉన్నారు. కానీ తన రాజకీయం కోసం వీరందర్నీ సైకోలుగా మార్చేసిన వ్యవహారంతో జగన్ రెడ్డి ఇప్పుడు ఆ కుటుంబాల వ్యథలకు కారణం అవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ రెడ్డి సామాజికవర్గం గౌరవనీయమైన స్థానంలో ఉంటుంది. చారిత్రకంగా వారు సాధించిన విజయాలను ఎవరూ తక్కువ చేయలేరు. కానీ జగన్ రెడ్డి మాత్రం మొత్తం కులంపై ప్రజల్లో ఓ రకమైన భావం కల్పించేలా చేశారు. రెడ్డి యువతలో కులం మత్తు నింపేసి ఇతర కులాలపై వ్యతిరేకత పెంచేసి.. వారిని మనుషులుగా కాకుండా మృగాల్లా మార్చేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. ఈ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో.. ఆ కులం యువత ఎలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారో ఇప్పుడు స్పష్టమవుతోంది.
రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి. సైకోతనంగా చేయకూడదు. కానీ ఎవరు బలైపోయినా పర్వాలేదు.. వారి శవాలపై నుంచి తాను రాజకీయ శిఖరాలు అధిరోహిస్తానని జగన్ రెడ్డి అనుకుంటారు. కానీ అందర్నీ బలి చేసి.. అండగా ఉండే వర్గాన్ని కూడా నాశనం చేసి ఆయన ఏ శిఖరాలను అధిరోహిస్తారో ఆయనకే తెలియాలి. నాయకుడు తనను నమ్ముకున్న వారిని బాగు చేసేందుకు ప్రయత్నించాలి కానీ.. వారిని ఉపయోగించుకుని పైకి పోవాలని అనుకోకూడదు. తనతో పాటు వారినీ పైకి తీసుకెళ్లాలి. కానీ జగన్ రెడ్డి కానీ పాతాళంలోకి వెళ్తూ వారినీ పాతాళంలోకి తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు రెడ్డి యువత ఇదంతా తెలుసుకోలేనంత కులం మత్తులో ఉన్నారు. తమకు చేటుచేసింది జగన్ రెడ్డేనని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిని జగన్ రెడ్డి తెచ్చారు. భావితరాల్లో రెడ్డి యువత ఎక్కువగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.