తెలంగాణ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. తెలంగాణలో జల వివాదం ప్రారంభమైన తర్వాత తొలి సారి ఆయన నోరు విప్పారు. అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్ల కేటాయింపులపై గతంలోనే ఒప్పందాలు జరిగాయని.. కేటాయించిన నీళ్లను వాడుకుంటే తప్పేంటని సీఎం జగన్ తెలంగాణ నేతల్ని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కాబట్టి నేరుగా కేసీఆర్‌కే జగన్ ప్రశ్నలు సంధించినట్లుగా అనుకోవచ్చు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని జగన్ గుర్తు చేశారు. 881 అడుగులు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు రావని… ఆ స్థాయిలో నీరు ఎంత కాలం ఉందని జగన్ ప్రశఅనించారు.
నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని కోరుకుంటున్నానని జగన్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాజకీయాల్లో నేనెప్పుడూ వేలు పెట్టలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కార్‌ను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ కారణంగా నీరు సముద్రం పాలవుతోంది. అయినా జగన్.. ప్రధానికి.. కేంద్రమంత్రులుక లేఖలు రాస్తున్నారు కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయలేదు.
కానీ బహిరంగసభలో మాత్రం కేసీఆర్‌కు సందేశం పంపినట్లుగా మాట్లాడారు. ఏపీ కేటాయింపుల నీటికే వాడుకుంటామని.. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పడం ద్వారా ఆయన .. తెలంగాణ పాలకులకు.. ఉన్న అనుమానాలను తీర్చే ప్రయ్తనం చేశారని భావిస్తున్నారు. షర్మిల రాజకీయ పార్టీ.. జగన్ ప్లాన్‌లో భాగం అని నమ్ముతూండటం వల్లే కేసీఆర్ ప్రస్తుతం.. నీటి వివాదం తెచ్చారని జగన్ అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే ఆయన బహిరంగంగా .. కేసీఆర్‌కు అనంతపురం వేదికగా.. తాను తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోనన్న అంచనాలు వినిపిస్తున్నాయి.