ఏపీ సీఎం రైతుల మోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారో చెప్పేశారు. ఎందుకంటే మీటర్లు పెడితే మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవట. అంటే సీఎం చెప్పే దాని ప్రకారం మీటర్లు లేకపోవడం వల్లనే మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్స్ కాలిపోతున్నాయన్నమాట. ఇంత కాలం..అందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ప్రవేశ పెట్టినప్పటి నుండి మీటర్లు లేవు…మరి ఎన్ని కాలిపోయాయో అనే డౌట్ .. జగన్ వ్యాఖ్యల వల్ల వస్తుంది. కానీ మనం అడగకూడదు. రోజూ రాష్ట్రంలో వందల సంఖ్యలోనే మీటర్లు కాలిపోతూంటాయి. ట్రాన్స్ ఫఆర్మర్లు కూడా కలిపోతూంటాయి. మరి వాటికి కూడా మీటర్లు లేకపోవడమే కారణమా..?
విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామని చెప్పి అప్పులు తెచ్చుకున్న ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి.,. మీకే మంచిదని చెప్పి బుకాయిస్తోంది. ఓ వైపు తెలంగాణ సర్కార్ మోటార్లకు మీటర్లు పెట్టడాన్నే పెద్ద ఇష్యూగా ప్రచారం చేస్తోంది. అలా చేయడం… రైతుల మెడకు ఉరి తాళ్లు వేయడమేనని చెబుతోంది. కేసీఆర్ అదే విషయాన్ని పదే పదే బహిరంగసభల్లో చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం అలా ప్రచారం చేసే వాళ్ల గురించి … వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలా చెప్పే వారికి చాలా విషయాలు చెప్పాలంటున్నారు.
వ్యవసాయంపై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. తాము వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. రైతు భరోసా . ఆర్బీకేలతో వారి రాతను మార్చేశామన్నారు. రాయలసీమకు ఎప్పుడూ ఇవ్వనన్ని నీళ్లిచ్చామన్నారు. అదే సమయంలో చంద్రబాబు హయాంలో అంతా కరువేనని చెప్పుకొచ్చారు ఎప్పుడూ చెప్పే విషయాలే అయినా… మోటార్లకు మీటర్లు పెట్టుకోవడానికి మాత్రం ఈ సారి కొత్త కారణం చెప్పి అందరితో.. జగన్ చెప్పారు.. నిజమేమో అని అనిపించుకునేలా చేశారు.