చర్చిల నిర్మాణానికి నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున మంజూరు చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. రూ. 175 కోట్లతో చర్చిల నిర్మాణం, చర్చిల మరమ్మతులు, ఇతర పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. . జిల్లా కేంద్రాలకు మరో కోటి చొప్పున అదనంగా మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానంలో ప్రభుత్వం అందించనుంది. మొత్తంగా నియోజకవర్గాలు.. జిల్లా కేంద్రాలకు కలిపి రెండు వందల కోట్లపైనై ఇవ్వనున్నట్లుగా అంచనా వేయవవచ్చు.
ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బులను మత పరమైన కట్టడాలకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. గతంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఎంపీ ల్యాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఇవ్వడం జాతీయ స్థాయిలో వివాదాస్పదమయింది. ఇప్పుడు నేరుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. అసలు చర్చిలు ప్రభుత్వానివి ఉండవు. అన్నీ ప్రైవేటువే. అలాంటి ప్రైవేటు చర్చిలకు ప్రభుత్వం కోట్లు ఎందుకు ఇవ్వాలన్నది మౌలికమైన ప్రశ్న.
దేవాదాయశాఖ నుంచి పెద్ద ఎత్తు నిధులు ప్రభుత్వం తీసుకుంటోంది. ఆలయాల ఆదాయాన్ని ప్రభుత్వం సీజీఎఫ్.. అని ఇతర మార్గాల ద్వారా తీసుకుంటోంది కానీ.. దేవాదాయశాఖకు పైసా కేటాయించదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు చర్చిలకు నిధులు కేటాయించడం వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. అంతే… గతంలోనే పాస్టర్లకు నెలకు రూ. ఐదు వేలు ఇస్తానంటూ హామీ ఇచ్చారు జగన్. అయితే అనేక రకాల నిబంధనలు పెట్టి.. వారిలో కొంత మందికే ఇస్తున్నారు..అది వేరే విషయం.