ఏపీ సీఎం జగన్ రెడ్డి సలహాదారులు ఏమీ పని చేయడం లేదనుకుంటారు కానీ…. చచ్చు పుచ్చు సలహాలతో….. ఆహా ఏమీ ఫేసు బాసు అని జగన్ రెడ్డిని అనుకునేలా చేయడంలో చాలా ముందు ఉంటారు. దానికి తాజాగా ఉదాహరణ ఉద్యోగులకు ప్రకటించిన డీఏ. ఏడాదిన్నర కిందట ప్రకటింంచాల్సిన డీఏ… ఇప్పుడు ప్రకటించి… బకాయిలు మాత్రం… వచ్చే సంవత్సరం నుంచి ఇస్తామని ఉత్తర్వులు ఇచ్చారు. ఇవేం ఉత్తర్వులురా నాయనా అని ఉద్యోగులు ఆశ్చర్యపడాల్సి వస్తోంది.
జగన్ రెడ్డి అదేదో పెద్ద జీతాల పెంపు అయినట్లుగా… డీఏల విషయంలో జగన్ రెడ్డి ఉద్యోగుల్ని ఆశపెట్టారు. గతంలో పెండింగ్ లో ఉన్న డీఏలన్నింటినీ… పీఆర్సీలో కలిపేశారు. అసలు పీఆర్సీకి .. డీఏలకు సంబంధం ఉండదు. ద్రోవ్యోల్బణం పెరుగుదలకు తగ్గట్లుగా డీఏలిస్తారు. ఇది ఆరు నెలలకోసారి జరగాలి. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడో డీఏలను మర్చిపోయింది. గత పండకు ప్రకటన చేస్తారు. ఆ తర్వాత పండగకు జీవోఇస్తారు. మళ్లీ పండగకు.. విడుదల చేస్తారు. అన్ని సార్లూ పాలాభిషేకాలు చేయించుకుంటారు.
అయితే చివరికి ఆ ఉత్తర్వుల్లోనూ ట్విస్టులు ఉంటాయి. బకాయిలు మాత్రం ఇప్పుడివ్వరట. ఎప్పుడిస్తారంటే.. వచ్చే ప్రభుత్వంలో ఇస్తారట. ఈ ప్రభుత్వం ఎందుకివ్వదు అంటే.. ఉండాలిగా… అంతా నాశనం చేసి వెళ్తే… వచ్చే వారు చూసుకుంటారు… మాకేంటి అనే ఓ దుర్భుద్ది. ఇప్పటికే… పదకొండు లక్షల కోట్ల అప్పులు చేశారు… ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని వారి వయసును పెంచారు. నిరుద్యోగుల్ని మోసం చేశారు. చివరికి డీఏలు ఇవ్వలేక .. తప్పుడు దోవలో వెళ్తున్నారు.