వైసీపీ రాష్ట్ర కార్యాలయం మూత పడింది. అక్కడ ఉన్న కంప్యూటర్లు ఇతర సామాగ్రిని జగన్ క్యాంప్ ఆఫీసుకు తరలిస్తున్నారు. ఎందుకు అంటే. ఆ భవనానికి అద్దె రూ.నాలుగు లక్షలని అధికారం లేదుకాబట్టి ఆదాయం ఉండదని అంత కట్టలేమని అంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అసలు కారణం అది కాదని టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన ఘటన వెంటాడుతోందని… ఎప్పుడైనా దాడి చేయవచ్చన్న ఆందోళనతోనే పార్టీ ఆఫీసును క్లోజ్ చేస్తున్నారని అంటున్నారు.
అదే క్యాంపాఫీసులో పెట్టుకుంటే.. టీడీపీ నేతుల దాడిచేసినా దాన్ని రచ్చ చేయవచ్చని అనుకుంటున్నారు. కానీ నేరుగా చంద్రబాబు ఇంటిపైకే దాడికి జోగి రమేష్ వచ్చారనే సంగతిని వైసీపీ నేతలు మర్చిపోతే ఎలా అన్న డౌట్ కూడా వైసీపీ నేతల్లో వస్తోంది. పార్టీకి అంతపెద్ద కార్యాలయం అవసరం లేదని.. ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు కూడా లేనందున… ఎక్కువ మంది పార్టీ కార్యాలయానికి వచ్చే అవకాశాలు కూడా లేవని అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో జగన్ రెడ్డి బయటకు అడుగు పెట్టలేరు. ఆయనకు భయం ఎక్కువగా ఉంటుంది. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు. ఆయన సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. అందుకే ప్రభుత్వం వైపు నుంచి వన్ ప్లస్ వన్ భద్రత ఉంటుంది. సీఎంగా ఉన్న వ్యక్తి ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల్లోనూ ఆ భద్రత ఉండేలా చేసుకున్నారు. కానీ ప్రతిపక్ష నేతకుకూడా ఆ స్థాయి భద్రత ఉండేలా చేసుకుంటే.. బాగుండేదన్న సెటైర్లు పడుతున్నాయి. ఇప్పుడు జగన్ సెక్యూరిటీ పరంగా కూడా అంత సేఫ్ గా భావించలేరు. అందుకే ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదంటున్నారు.