జగన్ హెలికాప్టర్లో వస్తున్నారంటే కింద ట్రాఫిక్ అపేస్తారు . రోడ్ యాత్ర అంట్ చెట్లు కొట్టేస్తారు. అంతకు మించి ఆయన తనకు.. తన కుటుంబానికి.. విదేశాల్లో కూడా భద్రత కల్పించేలా ప్రత్యేక సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబుకు కమెండోల రక్షణ ఉందని.. తనకూ అలాంటిది కావాలన్న ఉద్దేశంతో… స్పెషల్ డ్రెస్సులు కూడా డిజైన్ చేయించి వారి మధ్యనే పర్యటిస్తున్నారు. అయినా విజయవాడలో గులకరాయిపడింది.
సీఎంగా జగన్ తనకు.. తన కుటుంబానికి స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకునేముందే … సీఎంకు హై రేంజ్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన రోడ్డు మీదకు రావాలంటే.. మొత్తం ఇంటలిజెన్స్ పోలీసులు ముందుగానే జనంలోకి కలిసిపోయి.. ఎవరైనా నిరసనలు చేస్తారేమో చూస్తారు. వారిని పట్టుకుంటారు. రాళ్లేసేవాళ్లుంటే అలక్ష్యం చేయరు.తర్వాత రోప్ పార్టీ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. సీఎం భద్రతా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అయినా గులకరాయి పడింది.
సీఎం జగన్ సాధారణంగా బస్సు టాప్ పై ఎక్కరు. రెండు, మూడు వందల మంది జనాన్ని తీసుకు వచ్చినా ఆయన తన సీట్లో నుంచి.. చిద్విలాసంగా నమస్కారం చేస్తారు. నైట్ కరెంట్ ఆపేసి చేసిన రోడ్ షోలో అయితే.. అసలు బ యటకు రాకూడదు. అది సెక్యూరిటీ ప్రోటోకాల్ కూడా. ముఖ్యమంత్రి స్వయంగా తన భద్రత కోసం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా.. గులకరాయి వచ్చి పడిందంటే ఇంత కంటే చేతకాని తనం ఉన్న ప్రభుత్వం వ్యవస్థ ఉండదేమో ?