రఘురామను కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో జగన్ సర్వీస్ బ్యాచ్ పోలీసు అధికారులు నిండా మునిగినట్లే అయింది. సీఐడీ ఓఎస్డీగా పని చేసిన విజయ్ పాల్ అనే అధికారి విచారణకు హాజరయ్యారు. ఈ విజయ్ పాల్ రిటైర్మెంట్ అయినపోయినా సరే మనోడు అన్న కారణంగా జగన్ ప్రభుత్వంలో సీఐడీలో ఓఎస్డీగా నియమించారు. ఆయన పని టీడీపీ నేతలపై తప్పులు కేసులు పెట్టి తీసుకొచ్చి కొట్టడం.
రఘురామను అదే చేశారు. ఆయన హైదరాబాద్ కు పట్టిన రోజువేడుకల కోసం వస్తే టీమును పంపి అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకు వచ్చి ధర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఏ కేసు అంటే.. రఘురామను అరెస్టు చేసిన తర్వాత రాజద్రోహం కేసు పెట్టారు. దీనికి ఫిర్యాదుదారు ఎవరంటే ఈ విజయ్ పాలే. మీడియాతో మాట్లాడితే రాజద్రోహం ఎందుకవుతుందో.. ఆయనను కొట్టడానికే తీసుకొచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. రఘురామకృష్ణరాజు ప్రభుత్వం మారిన వెంటనే గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పట్నుంచి ఆయన పరారీలో ఉన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా రాలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. తదుపరి విచారణ వరకూ అరెస్టు నుంచి రక్షణ ఇచ్చిన సుప్రీంకోర్టు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. దాంతో ఆయన ఐదు రోజుల తర్వాత విచారణకు హాజరయ్యారు. ఇందులో మాజీ సీఎం జగన్ పేరు కూడా ఉంది. ఈ కేసులో ఉన్న పోలీసు అధికారుల్ని, సిబ్బందిని ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. అందరి వాంగ్మూలాలు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలను కూడా సేకరించారు. రఘురామను కొట్టారడానికి అవసరమైన అన్ని సాక్ష్యాలు ఉండటంతో త్వరలో అరెస్టులు చేసే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.