గౌరవంగా రిటైర్ కావడానికి వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు టార్చర్ పడిన ఏబీ వెంకటేశ్వరరావు చివరి రోజు కోర్టుల ఆదేశాలతో అతి కష్టం మీ పో స్టింగ్ తెచ్చుకుని రిటైర్ అయ్యారు. అయితే వైసీపీ హయాంలో బరితెగించిన అధికారులకు మాత్రం ప్రస్తుత ప్రభుత్వం గౌరవంగాన సాగనంపుతోంది. సాక్షాత్తూ చంద్రబాబుపై నేరుగా కుట్రలు చేసినా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నా.. రాష్ట్రానికి వారు చేసిన సర్వీసును దృష్టిలో పెట్టుకుని పోస్టింగ్ ఇచ్చి రిటైరయ్యేలా చేస్తోంది.
తాజాగా జగన్ సర్వీసులో ఐదేళ్ల పాటు మునిగితేలి మధ్యలో ఎస్ఈసీతో డిస్మిస్ సిఫారసు కూడా చేయించుకున్న గోపాలకృష్ణ ద్వివేదీ రిటైరవుతున్నారు. నెలాఖరులో రిటైరవుతున్న ఆయనకు పోస్టిగ్ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయనకు పోస్టింగులు ఇచ్చినా ఆయన నిర్వాకాలపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్నారు. గౌరవంగా రిటైరయ్యలా పోస్టింగ్ ఇవ్వాలని ఆయన చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. పోస్టింగ్ ఇచ్చింది.
2019 ఎన్నికల సమయంలో సీఈవోగా ఎన్నికల నిర్వహణ చూసిన ఆయన పూర్తిగా వైసీపీ కనుసన్నల్లో పని చేశారు. ఆయన చేసిన పనులకు చంద్రబాబు ఆయన చాంబర్ ఎదుట ధర్నా కూడా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జీ హుజూర్ అధికారిగా పని చేశారు. స్థానిక ఎన్నికల విషయంలో ఎస్ఈసీ మాట వినకపోవడంతో ఆయన.. నేరుగా డీవోపీటీకి ఫిర్యాదు చేశారు. అయితే ఎలాగోలా బయటపడ్డారు. ఇప్పుడు గౌరవంగానే రిటైరవుతున్నారు.