ఏపీలో జగన్ బ్యాచ్ సర్వీస్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు రాజకీయ నేతల్ని మించి పోతున్నారు. తమపై వస్తున్న ఆరోపణలకు నేరుగా మీడియా కవరేజీ వచ్చేలా.. రాజకీయ వ్యూహాలతో తెర ముందుకు వస్తున్నారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నాంటూ 19 మంది ఐపీఎస్ అధికారులు సీఈవోను కలిసి వినతి పత్రం ఇవ్వడం సంచలనంగా మారింది. మొత్తంగా 140కిపైగా ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే.. వారిలో ఈ పందొమ్మిది మాత్రమే ప్రత్యేకం అని నిరూపించారు. ఇందులో ఈసీ ఇటీవల వేటు వేసిన ఆరుగురు ఐపీఎస్లు కూడా ఉన్నారు.
వీరంతా ఈ ఐదేళ్లలో చేసిన ఘన కార్యాలు, అసలు ఐపీసీని అమలు చేయకుండా.. బాధితులపైనే కేసులు పెట్టడం … కేవలం పొలిటికల్ పోలీసింగ్ చేయడం మాత్రమే వీరు చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో మళ్లీ జగన్ ను గెలిపించకపోతే.. తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక అవుతుదంని.. బరి తెగించేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ లాంటి పోస్టు ఇచ్చారు అనేమో కానీ కాంతిరాణా టాటా ఈ ఐపీఎస్ అధికారులందరికీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఎన్నికల సమయంలో పోలీసుల అధికారుల తీరే కాదు. ఎన్నికలు నిర్వహించే ప్రతి అధికారి తీరును మీడియా ప్రశ్నిస్తుంది. తప్పు చేస్తే నిర్మోహమాటంగా ప్రశ్నిస్తుంది. గత ఐదేళ్లలో వీరు చేసిన అరాచకాలు ఇప్పుడు కళ్ల ముందే ఉన్నాయి. ఇప్పుడు వీరు మీడియా నిందలు వేస్తోందని ఈసీ ప్రభావితమవుతోందని.. ఈసీని కూడా బ్లాక్ మెయిల్ చేసేందుకు సిద్దమవుతున్నారు. క్రిమినల్ రికార్డు ఉన్న పాలకుల చేతిలో పోలీసులు ఉంటే.. ఏమవుతుందో.. ఇలాంటి అధికారులు నిరూపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.