జగన్ రెడ్డి సర్వీసులో తరించి ప్రతిపక్షాలపై కుట్రలు, కుతుంత్రాలతో పాటు పెద్ద ఎత్తునవ రాష్ట్ర సంపదను దోచుకోవడంలో కీలక పాత్ర పోషించిన అఖిల భారత సర్వీస్ అధికారులు ఇప్పుడు తప్పించుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ సర్వీస్ కు వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. వీరిలో కొంత మందిని జగన్ రెడ్డి సర్కార్ వచ్చాక వివిధ చోట్ల నుంచి డిప్యూటేషన్ పై ఏపీకి తీసుకు వచ్చారు. మరికొంత మంది రాష్ట్ర సర్వీస్ అధికారులు ఉన్నారు. వీరు చేసిన నేరాలేమిటో వారికి బాగా తెలుసు. ప్రభుత్వం మారిన మరుక్షణం జైల్లో ఉంటామని కూడా తెలుసు. అందుకే ముందుగానే పారిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతామని అభ్యర్థనలు పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోవాలంటే ఇక్కడ జగన్ రెడ్డి సర్కార్ ఎన్వోసీ ఇవ్వాలి. మళ్లీ మనమే వస్తామని ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎంతగా చెబుతున్నా వారికి నమ్మకం కుదరడం లేదు. అదే జరిగితే మళ్లీ వచ్చి ఏం చేయామన్నా చేస్తాం కానీ ఇప్పటికైతే ఎన్వోసీ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో పది మందికిపైగా అధికారులకు ఏపీ సర్కార్ ఢిల్లీ వెళ్లేందుకు ఎన్వోసీ ఇచ్చింది.
అయితే ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లుగా ఏపీ ఎన్వోసీ ఇస్తేనే మళ్లీ కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోరు. దానికో లెక్క ఉంటుంది. ఓ పద్దతి ఉంటుంది. అయితే ఈ అధికారులు మామూలు వాళ్లు కాదు కాబట్టి పై స్థాయిలో తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీలైనంత త్వరగా కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవాలని బతిమాలుకుంటున్నారు. సీఐడీలో పని చేసిన సంజయ్, సునీల్ కుమార్, మార్గదర్శిపై ఏకపక్షంగా దాడి చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారి రామకృష్ణ, ప్రవీణ్ ప్రకాష్ సహా.. పది మంది ఉన్నతాధికారులకు ఇప్పటి కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే కేంద్ర సర్వీసులకు వెళ్తే దూరంగా వెళ్లిపోయామనుకోవడం ఆపోహేనని.. టీడీపీ వర్గాలు ఇప్పటికే సెటైర్లు వేస్తున్నాయి.