గుంటూరు జైలు నుుందు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో జర్నలిస్టులపై జగన్ చూపించిన అసహనం చూసి ఎవరికీ కోపం రాలేదు. చాలా మందికి పాపం అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా టెన్షన్ లో ఉన్నారు. ఏం మాట్లాడాలన్నా చూసి చదవాలి. ఆ స్క్రిప్టులు చాలా కఠినంగా ఉన్నాయి. బూతులున్నాయి. వాటిని చెప్పాల్సి వచ్చింది. అంతేనా.. అధికారం పోయిన తర్వాతైనా తన తెంపరి తనాన్ని కవర్ చేసేలా ప్రసంగాన్ని రూపొందించాల్సింది . అది కూడా లేదు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాసిన స్క్రిప్టులు ఇప్పుడు చదివితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. జగన్ ను ఇప్పుడు జగన్ ను ఎవరైనా తిడితే.. ఆయన అభిమానస్తులు అని చెప్పుకునేవారుబ యటకు రాగలరా.. డబ్బులిస్తామని సజ్జల చెప్పినా బయటకు రారు. ఎందుకంటే పవర్ లో లేరు కాబట్టి ఆయన అభిమానస్తులకు బీపీలు రావు. ఇలాంటివన్నీ స్క్రిప్టుల నిండా ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున .. కాస్త పద్దతిగా మాట్లాడేలా స్క్రిప్టును మార్చుకోవాల్సి ఉంది.
సీఎంగా ఉన్న సమయంలో ఆయన చుట్టూ ఉన్నవారంతా ఆయనను ఉబ్బేసి.. అదేమంచిదని నమ్మించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభావం లేని స్క్రిప్ట్ రైటర్లు అయితే కాస్తంతా హుందాతనం తెచ్చి పెట్టే ప్రయత్నం చేస్తారు. జగన్ ఆ దిసగా ఆలోచించాలేమో . లేకపోతే కొత్త వ్యూహకర్త కూడా ఏమీ చేయలేడు.