రఘురామకృష్ణరాజు తనపై దాడి చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టి వారిని శిక్షించేలా చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కోర్టుకు వెళ్తున్నారు..జైలుకు వెళ్తున్నారు.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లి …తన వాదన వినిపిస్తున్నాయి. సీఐడీ చేసిన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులను వదిలిపెట్టేది లేదన్న గట్టి నమ్మకంతో పోరాడుతున్నారు.
కానీ అదే జగన్ రెడ్డి తనపై కోడికత్తితో దాడి చేశారని.. కొద్దిగా ఉంటే చచ్చిపోయేవాడ్నని ప్రచారం చేసుకున్న దాడి కోసం కనీసం బాధితుడిగా వాంగ్మూలం ఇవ్వడానికి కూడా ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. ఏరి కోరి తెచ్చుకున్న ఎన్ఐఏ దర్యాప్తు రిపోర్టును కూడా ఆయన నమ్మడం లేదు. తన పై దాడి జరిగింది కాబట్టి తన రాజకీయ ప్రత్యర్థులపై తోసేసి రాజకీయం చేయడానికి అవసరమైన రిపోర్టు వస్తే తప్ప ఆయనకు నిద్రపట్టదు.
నిజంగా జగన్ రెడ్డికి కాస్తయినా బుర్ర ఉంటే కనీసం బాధితుడిగా అయినా కోర్టుకు వెళ్లి.. ఆ కోడి కత్తి దాడి ఘటనలో ఏం జరిగిందో చెప్పాలి.కానీ విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవడం.. రకరకాల పిటిషన్లు వేయడం ఎందుకు?. నిజంగా తనపై దాడి జరిగి ఉంటే చట్టపరంగా శిక్షించేలా ఎందుకు చేయరు?. రాజకీయ ప్రత్యర్థుల పేర్లు తెస్తే తప్ప ఆయనకు సంతృప్తి ఉండదంటే.. అది ఆయనే చేయించుకున్నారని అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మొత్తంగా జగన్ రెడ్డి కోడికత్తి కేసులో బాధితుడుగా ఉన్నారు కానీ..,నిందితుడిలాగా భయపడి కోర్టుకు మాత్రం హాజరు కావడం లేదు. కానీ రఘురామ తనపై దాడి చేసిన వారిని జైలుకు పంపే వరకూ విశ్రమించేది లేదని తిరుగుతున్నారు.