ఏపి సిఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరు కాలేదు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్… ఏపీ పర్యటనకువస్తున్న కారణంగా.. ఈ శుక్రవారం మినహాయింపు కావాలని ఆయన లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను సీబీఐ న్యాయస్థానం అంగీకరించింది. అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి.. వైఎస్ జగన్ కోర్టుకు హాజరు కావడం లేదు. ఆరు నెలలుగా వివిధ కారణాలు చెబుతూ… ఎప్పటికప్పుడు.. అబ్సెంట్ పిటిషన్లు వేస్తున్నారు. శాశ్వతంగా… కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు కోసం.. పిటిషన్ దాఖలు చేసినా ప్రయోజనం లేకపోయింది. దాంతో.. ఈ వారం ఆయన కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది.
అయితే.. ముఖ్యమంత్రి హోదాలో.. కోర్టుకు హాజరవడం.. అంత మంచిది కాదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే.. ఆయన ఏదో విధంగా మినహాయింపు పొందే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలోలా.. ప్రతీవారం.. ఏదో ఓ కారణంతో.. పిటిషన్ వేస్తే.. కోర్టు ఎంతో కాలం.. సహనంతో ఉండదని.. వారెంట్ జారీ చేసినా చేయవచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో.. మినహాయింపు కోసం.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు జగన్ తరపు లాయర్లు కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే.. ఒకటి, రెండు వారాలు ఏదో విధంగా.. మినహాయింపు ప్రయత్నాలు చేయాలనుకున్నారు. ఈ క్రమంలో తొలి సారి.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన రూపంలో.. ఓ కారణం దొరికింది.
అయితే.. ప్రతీ వారం ఓ కేంద్రమంత్రి ఏపీకి రాకపోవచ్చని.. ఈ వారం కాకపోతే.. వచ్చే వారమైనా.. జగన్మోహన్ రెడ్డి.. కోర్టు మెట్లెక్కక తప్పదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ రోజు జగన్ సీఎం హోదాలో కోర్టు బోనులో నిలబడితే… విమర్శల వర్షం కురిపిద్దామనుకున్న విపక్షాలకు… అవకాశం దక్కలేదు. మరి 22వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఏ కారణం వెదుక్కుంటారో..?