జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు ముగ్గురు మంత్రులు చేశారు. వారు ముగ్గురు దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు. వీరు ముగ్గురూ కాపు సామాజికవర్గానికి చెందిన వారే. వీరి ముగ్గురిపై జనసేన నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. జనసేన అభిమానులే కాదు కాపు సామాజికవర్గం వారు కూడా మండి పడుతున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఎందుంటే వారు చేసింది రాజకీయ విమర్శలు కాదు .. ఆ పేరుతో వ్యక్తిత్వ, కుటుంబ గౌరవ హననానికి పాల్పడటం.
ఆ ముగ్గురు కాపు నేతలు పవన్ కల్యాణ్‌ను దారుణంగా కించ పరిచారని.. వారి ముగ్గురి కుటుంబాలను కూడా తెరపైకి తెచ్చి జనసైనికులు విమర్శలు చేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ విలాస పురుషుడన్న పేరు ఉంది. ఆయన తరచూ శ్రీలంక కాసినోల్ని సందర్శిస్తారు. గత ఎన్నికలు ముగిసిన తర్వాత శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు కూడా ఆయన శ్రీలంకలోనే ఉన్నారు. అదే సమయంలో ఆయన అనేక మంది మహిళలతో సరదాగా కలిసి ఉన్న ఫోటోలను జనసైనికులు వైరల్ చేస్తున్నారు. ఓ కుటుంబ ఫంక్షన్లో భార్యతో కలిసి చేసిన డాన్స్ వీడియోలను కూడా పోస్టు చేస్తూ అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారు.
దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబులను కూడా వదిలి పెట్టడం లేదు. వీరి ముగ్గురి ఫోటోలతో దారుణంగా ఫ్లెక్సీలు తయారు చేసి విశాఖలో ర్యాలీ కూడా నిర్వహించారు. అందరూ కాపు సామాజికవర్గానికి చెందినవారే. పవన్ కల్యాణ్.. ఆయా నేతలతో తిట్టించడం ద్వారా.. ఆ సామాజికవర్గంలోనే చిచ్చు పెట్టేస్తున్నారు. ఈ కుట్రని గుర్తించలేని ఆ నాయకులు.. తమకు మంత్రి పదవి ఇచ్చారని ముందు వెనుకూ చూసుకోకుండా చెలరేగిపోతున్నారు. అంతిమంగా తమ సామాజికవర్గంపై కుట్ర చేస్తున్నారని.. అందులో తాము భాగస్వాములము అవుతున్నామని అంచనా వేయలేకపోతున్నారు. దీంతో వైసీపీ అధినేత రాజకీయం అనుకున్నట్లుగా సాగుతోంది.