వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో పని చేసేందుకు డిప్యూటేషన్‌పై ఏపీకి వచ్చిన అధికారులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. వారు ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ఉద్యోగులైనా…ఐపీఎస్ అయినా..ఐఎఏస్ అయినా.. ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నారు. ఎవరికీ పోస్టింగులు ఇవ్వడం లేదు. ఎవర్నీ రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేయడం లేదు. తన టార్గెట్‌ను బట్టి కేసులు కూడా పెడుతున్నారు. అయితే.. ఒకే ఒక్క అధికారికి.. ఈ విషయంలో మినహాయింపు లభించింది. మిగతా వారితో పోలిస్తే.. ఆ అధికారిపైనే… ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ.. జగన్.. ఆ అధికారిపై చాలా సాఫ్ట్ కార్నర్ చూపించారు. రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేశారు. కేంద్రంలో ఉద్యోగంలో చేరేందుకు అనుమతిచ్చారు. ఆ అధికారి పేరు గోపీనాథ్.
ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ఉద్యోగి.. ఐటీ డిపార్ట్మెంట్లో పని చేస్తూ.. టీడీపీ హయంలో.. ఏపీకి డిప్యూటేషన్ వచ్చారు.. గోపీనాథ్. ఆయనకు.. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు కూడా దక్కాయి. ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనిజింగ్ డైరక్టర్‌గా పని చేశారు. ఈయన ఎవరో కాదు.. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు. ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో పలు ప్రాజెక్టుల విషయంలో అవకతవకలు జరిగాయని.. ఏసీబీ ప్రాధమికంగా నివేదిక ఇచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. క్రిమినల్ కేసులు పెట్టాలని సీఐడీకి సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం అనుమతి కోసం ఓ లేఖ రాశారు. కాని అది పెండింగ్‌లో ఉంది.
ఇప్పుడు.. ఆ కేసు పెట్టేందుకు.. జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇవ్వకపోగా.. గోపీనాథ్ ను సొంత కేడర్‌కు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేశారు. దాంతో ఆయన సొంత కేడర్‌లో చేరేందుకు వెళ్లిపోయారు. అయితే అదే సమయంలో.. జాస్తి కృష్ణకిషోర్ అనే అధికారి విషయంలో మాత్రం జగన్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఆయన హయాంలో భారీ అవినీతి, అవకతవకలు ఏమీ జరిగినట్లు తేలకపోయినా.. ఓ జీవో నిబంధనలను ఉల్లంఘించారంటూ సస్పెన్షన్ వేటు వేయడమే కాదు… కేసు కూడా.. సీఐడీతో నమోదు చేయించారు. కృష్ణకిషోర్ విషయంలో.. జగన్ అలా.. వ్యవహరిస్తూ.. యనమల అల్లుడి విషయంలో మాత్రం.. అంతా లిబరల్గా ఎలా ఉంటున్నారన్నది .. చాలా మందికి అర్థం కాని ప్రశ్న. దీని వెనుక ఉన్న రాజకీయం ఏమిటో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.