జగన్ రెడ్డి ప్రత్యేక హోదాను కేంద్రానికి అమ్మేసారు. మరోసారి హోదా అనే మాటెత్తనని స్పష్టం చేసి దానికి బదులుగా డబ్బులు తెచ్చుకున్నారు. ఈ వ్యవహారం కేంద్రం పార్లమెంట్ సాక్షిగా బయట పెట్టింది. ప్రత్యేకప్యాకేజీకి నిధులు ఇచ్చి నిధులు తెచ్చుకుందని కేంద్ర మంత్రి ప్రకటించారు.
ప్యాకేజీపై తప్పుడు ప్రచారం చేసి అప్పట్లో తీసుకోకుండా రాజకీయం
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని.. హోదా ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించడం లేదని గతంలో తెలిపింది. దానికి చంద్రబాబు అంగీకరించారు. ప్యాకేజీ ప్రకటించారు. హోదా కన్నా ఎక్కువ లాభాలు వస్తాయని .. నిధులు వస్తాయని లెక్కలేశారు. అయితే అప్పట్లో ఉన్న ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి…. హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టేశారని ప్రచారం ప్రారంభించారు. డిఫెన్స్ లో పడిపోయిన చంద్రబాబునాయుడు ప్యాకేజీతో పాటు హోదా కావాలని రాజకీయం మార్చారు. ఫలితంగా ప్యాకేజీ రాలేదు హోదా రాలేదు. దీన్ని చూపించి… తనకు ఎంపీ సీట్లు మెడలు వంచుతానని జగన్ రెడ్డి చెప్పుకున్నారు. జనం ఎంపీ సీట్లు ఇస్తే… ఆయన ఇప్పుడు హోదాను కేంద్రానికి అమ్మేశారు.
హోదాను కేంద్రానికి అమ్మేసిన జగన్ రెడ్డి
ఇటీవల కేంద్రం . రాష్ట్రానికి రూ.10, 461 కోట్లు ఇచ్చింది. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిందా అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు మంగళవారం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి బదులిచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లోటుకుగానూ రూ.10, 461 కోట్లు ఈ ఏడాది మేలో విడుదల చేసినట్టు తెలిపారు. ప్యాకేజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు గ్రాంట్ క్రింద రూ.10,460.87 కోట్లు విడుదల చేశామన్నారు.
ఏపీకి ఇంత అన్యాయమా ?
హోదా వస్తే ప్రతీ జిల్లా హైదరాబాద్ అవుతుందని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు జగన్ రెడ్డి, హోదా వస్తే ఇన్ కంట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదన్నారు. అలాంటి ఆశలు రేపి హోదా ఉద్యమం చేశారు. ప్రజల్ని మాయచేశారు. తీరా… అధికారంలోకి వచ్చాక.. హోదాను డబ్బులకు అమ్మేసి ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ..ప్రజల గొంతు కోశారు. ఇలాంటి పాలకుల వల్ల ప్రజలు రాజకీయాలపై.. రాజకీయ నాయకులపై విరక్తి చెందే అవకాశం ఉంది.