సీఎం జగన్మోహన్ రెడ్డి రాను రాను ప్రసంగాల్లో తన బేలతనాన్ని బయట పెట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన ఆయన మాటలు అలాగే ఉన్నాయి. మంచిచేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ. .ఎన్నికల్లో గెలవడమే కష్టమంటున్నారని ఏడుపు మొహం పెట్టుకుని దీనంగా వ్యాఖ్యానించారు మీ బిడ్డ పాలనలో మీకు జరిగిఉంటే.. మీరే సైనికులుగా తోడుగా నిలవాలని ప్రాధేయపడ్డారు. జగన్మోహన్ పెడ్డి ఈ మాటలు ప్రసంగం చివరిలో అనడంతో..ఒకప్పుడు ఆయన ప్రసంగాలను ఇప్పటి ప్రసంగాలను చూసి.. ఇదేం మార్పు అనుకుంటున్నారు వైసీపీ నేతలు.
అప్పట్లో వైఎస్ లాగానే పోర్టుకు భూమిపూజ ఇక దశ తిరిగిపోయిందని కథలు చెప్పడానికి జగన్ చాలా సమయం కేటాయించారు. వైఎస్ పదిహేనేళ్ల కింద చేసిన శంకుస్థాపనకే దిక్కు లేనప్పుడు మళ్లీ పదిహేనేళ్ల తర్వాడ కొడుకు మళ్లీ శంకుస్థాపన చేస్తే ఎవరు నమ్ముతారని అనుకోలేదు. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం ఇష్టారీతిన చెలరేగిపోయారు. పోర్టు రాకూడదని అనుకున్నారని.. ఆరోపించారు. ఇరవై నాలుగు నెలల్లో పెద్ద పెద్ద ఓడలు వస్తాయని జగన్ గాల్లో మేడలు కట్టారు.
అమరావతి స్థలాల గురంచి కూడా జగన్ గొప్పగా చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంతంలో కూడా ఇలా 50వేల మందికి నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలనుకుంటే అడ్డుపడుతున్నారన్నారు. అమరావతిలో ప్రభుత్వ డబ్బుతో గేటెట్ కమ్యూనిటీ కట్టుకోవాలనుకున్నారని.. కానీ తాను పేదలకు ఇళ్లు ఇస్తున్నాని చెప్పుకొచ్చారు. 26న అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ స్వయంగాచేస్తున్నానని ప్రకటించుకున్నరాు. ప్రతి పేదవాడికి 1 సెంటు భూమి ఇచ్చి, ఇల్లుకూడా ఉచితంగా కట్టించి ఇస్తే.. చంద్రబాబు స్మశానంతో పోలుస్తున్నారని మండిపడ్డారు. అసలు అమరావతిని స్మశానంగా పోల్చింది వైసీపీ మంత్రులే అన్న సంగతిని జనం మర్చిపోయారని జగన్ అనుకుంటన్నారేమో కానీ.. ఆయన ఈ విమర్సలు చేస్తున్నప్పుడు ప్రజల్లో స్పందనేలేదు.
జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలన్నీ పూర్తి ఆత్మరక్షణ ధోరణిలోకి సాగుతున్నాయి. పాలనా వైఫల్యాలన్నీ ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో.. మరో వైపు వైఎస్ వివేకా హత్య కేసు ఎటు వైపు ఎటు వస్తుందో తెలియని పరిస్థితుల్లోఆయనయ ఆయన ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతున్నట్లుగా ప్రసంగాలు ఉంటున్నాయి.