వైసీపీపై పోరాడుతున్న ఇతర పార్టీల నేతల్ని చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లని ట్రోల్ చేస్తున్న జగన్ రెడ్డికి అసలు చంద్రబాబుకు తానే పెద్ద స్టార్ క్యాంపెయినర్ను అనే సంగతి గుర్తుకు రావడం లేదు. తన విషయంలో జరిగే ప్రతి విషయానికి చంద్రబాబుతో ముడి పెట్టి అంతర్జాతీయ అంశాల వరకూ చంద్రబాబే చేయించాడని ప్రచారం చేస్తూంటారు జగన్ రెడ్డి. చంద్రబాబుకు ఆయన కన్నా ఎక్కువ ఎవర్ స్టార్ క్యాంపెయినర్ ఉంటారు ?
ఏదైనా చంద్రబాబే – జగన్ రెడ్డి ప్రచారం
తల్లి, చెల్లి వదిలేసి వెళ్లిపోయారు. దానికీ చంద్రబాబే కారణం., కుటుబంంలో చిచ్చు పెట్టేశారని ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడే ఎందుకు.. జైల్లో ఉన్నప్పుడు జగన్ కోసం షర్మిల ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేసారు. నిజంగా జగన్ సొంత చెల్లినే చంద్రబాబు ప్రభావితం చేయగలిగే రేంజ్ లో చంద్రబాబు ఉంటే జగన్ మాత్రం ప్రభావితం కాకుండా ఎలా ఉంటారు. మొత్తంగా ఏం జరిగినా చంద్రబాబే అంటూ.. చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ గా ఎప్పుడో మారారు జగన్ రెడ్డి.
చంద్రబాబుకు తెలియనంత బలం ఆపాదించే స్టార్ క్యాంపెయినర్ జగన్ రెడ్డి
బీజేపీ వెనుక చంద్రబాబు ఉన్నారంటారు.. సీబీఐ వెనుక చంద్రబాబు ఉన్నారంటారు.. కాంగ్రెస్ వెనుక చంద్రబాబు ఉన్నారంటారు.. కోర్టు తీర్పుల వెనుక చంద్రబాబు ఉన్నారంటారు.. ఇలా లెక్కలేస్తే.. చంద్రబాబును బాహుబలిగా ప్రపంచం ముందు నిలబెట్టేది జగన్ రెడ్డినే. చంద్రబాబు ఇంత బలవంతుడా.. మాకు తెలియదే అని వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయేంత బలం ఆపాదిస్తూ.. స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తోంది జగన్ రెడ్డే.
జగన్ రెడ్డి చేతకానితనమే చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్
యువకుడు .. ఒక్క చాన్స్ అని ప్రజలు పదవి ఇస్తే.. జగన్ రెడ్డి చేసిన నిర్వాకం చూసి ప్రజలు చంద్రబాబు గ్రేట్ అనే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు.. అదే చంద్రబాబు ఉంటే అనిపించేలా ప్రతీ సారి అందరితో అనిపిస్తున్నది ఎవరు… ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి. అంత కన్నా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ ఎవరు ఉంటారు. ఎన్నో ఆశలతో పట్టం కట్టిన ప్రజల ఆశల్ని కూల్చేసి.. చంద్రబాబు ఉంటే బాగుండు అనిపించేలా చేసిన స్టార్ క్యాంపెయినర్ జగన్ రెడ్డి.
జగన్ రెడ్డి ఎలా తన పార్టీ కోసం పని చేసుకుంటున్నారో పురందేశ్వరి, షర్మిల సహా ఇతర పార్టీల నేతలు వారి పార్టీ కోసం పని చేసుకుంటూ ఉంటారు. వారేమీ చంద్రబాబు కోసం పని చేయరు. కానీ నిరంతరం చంద్రబాబు కోసం పని చేసేది .. ప్రచారం చేసేది జగన్ రెడ్డి మాత్రమే.