జగన్ 2.0 చూస్తారని జగన్ రెడ్డి తన కార్యకర్తలకు చూపించారు. నిజానికి ఆయన లండన్ లో మేధో మేళనం చేశారో.. . ఏ స్ట్రాటజిస్టుతో కలిసి వ్యూహం రచించారో కానీ.. తన 2.0ని అమలు చేయడం ప్రారంభించారు. ముద్రగడ పద్మనాభం ఇంట్లోకి ఓ వ్యక్తి ట్రాక్టర్ తో వెళ్లి ..కారును ఢీకొట్టడం.. దానికి కూటమి కార్యకర్త అని ముద్ర వేసి చేసిన రాజకీయం ఇంకా కొనసాగుతోంది. ముద్రగడపై దాడి జరిగినప్పుడు కాపు నేతలందర్నీ ఆయన ఇంటికి పరామర్శకు పంపారు. ఆ వెంటనే జగన్ తాడేపల్లికి వచ్చిన రెండో రోజునే ఆయన ఇంటి ఎదురుగా బ్యూటిఫికేషన్ చేయించుకున్న రోడ్ సైడ్ గడ్డికి ఎవరో నిప్పు పెట్టారు. ఒక సారి కాదు.. రెండు, మూడు సార్లు నిప్పు పెట్టారు. ఎందుకిలా జరిగింది ?. జగన్ ఇంటి ముందు 40 కోణాల్లో ఉన్న సీసీకెమెరా దృశ్యాలను సాక్షి టీవీ ఎందుకు బయట పెట్టలేదు ?. ఆ నిప్పు పెట్టిన వారు ఎవరు?.
జగన్ రెడ్డి హిస్టరీ అంతా రాజకీయం ఇలాంటి స్కిట్లుతోనే నడుస్తూ పోతోంది. కోడికత్తి కేసు..గులకరాయి దాడితో పాటు చాలా ఘటనలు ఉన్నాయి. ఆయన బయటకు వస్తే మొత్తం స్క్రిప్టే. ఆ హావభావాలతో సహా . లండన్ నుంచి బెంగళూరు వచ్చి.. అక్కడ్నుంచి విజయవాడ చేరుకున్న తర్వాత .. కారులో వెళ్తూ పగలబడి నవ్వుతున్నట్లుగా వీడియో రిలీజ్ చేశారు. ఘోరంగా ఓడిపోయి పార్టీ నేతలు , కార్యకర్తలు అంతా ఛీ కొడుతూంటే.. అలా ఎందుకు నవ్వుతున్నారో ఆయనకే తెలియాలి. కానీ తాను హ్యాపీగా ఉన్నానని లోపల మండిపోవడం లేదని ప్రచారం చేసుకోవడానికే ఈ వీడియో రిలీఫ్ చేశారు.
ఇలాంటి టెక్నిక్లతో టూ పాయింట్ జీరోను .. పై స్థాయికి తీసుకెళ్తానని జగన్ కార్యకర్తలను నమ్మిస్తున్నారు. కానీ జగన్ రెడ్డి 1.0ను గుర్తుకు తెచ్చుకునంటే సమాజంలో ప్రతి ఒక్కరికి జలదరింపు వస్తుంది. ఇప్పటికీ ఆ పాలన బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. లక్షల మంది ఆస్తులు రిస్కులో పెట్టారు. ఉపాధి లేకుండా చేశారు. మద్యం పేరుతో రక్తం పీల్చారు. ఒక్క ఉద్యోగ నియామకం లేదు. చివరికి పనులు కూడా లేవు. రోడ్లు కూడా వేయలేదు. అలాంటి వన్ పాయింట్ జీరోను.. జీరో పాయింట్ ఫైవ్ ను ప్రజలు మళ్లీ కోరుకునే అవకాశాలు ఉండవు. కానీ గతంలో చేసిన తప్పులతో దొరికిపోయి మళ్లీ జైలుకు వెళ్లకుండా జగన్ చేసే స్కిట్లు మాత్రం కొనసాగుతాయి.