తాను పదవిని చేపట్టిన జగన్ అన్న మాటలు .. పదవి ఆఖరుకు వచ్చే సరికి అన్నీ ఆయనకు రివర్స్ అవుతున్నాయి. తాజాగా ఆయన శంకుస్థాపనల గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు ప్రతీదానికి సరిపోతోంది. ఎన్నికలకు ముందు శంకుస్థాపనుల చేస్తే దాన్ని మోసం అంటారు అంటూ కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ జగన్ వ్యాఖ్యానించారు. విచిత్రం ఏమిటంటే ఆ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనను మొన్న మళ్లీ చేశారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా. ఇలాంటి శంకుస్థాపనలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి కోసం రాష్ట్రం మొత్తం తిరగబోతున్నారు.
బోగాపురం ఎయిర్ పోర్టులో వచ్చే నెలలో సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. నిజానికి ఈ బోగాపురానికి అన్ని అనుమతులు తీసుకు వచ్చి… భూసేకరణ జరిపి చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. కానీ జీఎంఆర్ కు దక్కిన కాంట్రాక్ట్ ను తాను అధికారంలోకి రాగానే రద్దు చేసి ఐదు వందల ఎకరాలు తగ్గించి మళ్లీ ఆయనకే ఇచ్చారు. కానీ ఇలా ఐదు వందల ఎకరాలు తగ్గించడం అంటే… ప్రాజెక్టును తగ్గించడమే. అంతే కాదు ఈ రివర్స్ నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి. అనుమతులు కొత్తగా తీసుకోవాల్సి వచ్చింది. అవి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అయినా సరే… ఎన్నికలకు ముహుర్తం ముంచుకొచ్చేస్తోదంని శంకుస్థాపనకు బయలుదేరారు.
అదొక్కటే కాదు భావనపాడు పోర్టు. బందరు పోర్టు శంకుస్థాపనలు కూడా చేయాల్సి ఉంది . ప్రతి రెండు వారాలకు ఓ శంకుస్థాపన చేసి… ప్రజాధనంతో పార్టీ ప్రచారసభలను పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. బందరు పోర్టు పనులు ఐదు వందల కోట్లు వరకూ ఖర్చు పెట్టి చేసిన తర్వాత ఆపేశారు. భావనపాడూ అంతే. అన్నీ అభివృద్ధి పనుల్ని తాను నిలిపివేసి ఇప్పుడు మళ్లీ అధికారంలోకి దిగిపోయే సమయంలో మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారు. దీని వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. గతంలో జరుగుతున్న పనుల్ని కొనసాగిస్తే ఇవన్నీ ఈ పాటికి పూర్తయ్యేవి.
నాలుగేళ్ల పాటు అభివృద్ధి అనే మాటే లేకుండా సాగించిన పాలనతో ప్రజల్లో విరక్తి పుట్టిన సూచనలు కనిపిస్తూండటంతో తాను కూడా ఏదో ఒకటి చేస్తానని చెప్పుకునేందుకు జగన్ తాపత్రయ పడుతున్నారు. అందుకే శంకుస్థాపనలు చేస్తున్నారని అంటున్నారు. అయితే తీసుకున్న రివర్స్ నిర్ణయాల వల్ల… అభివృద్ధి పనులన్నీ ఎక్కిడివక్కడ పడకేశాయి. ఇప్పుడు వాటిని లేపాలంటే… నిధులు కావాలి. అవి లేకపోవడంతో శంకుస్థాపనలు అయినా చేయాలని అనుకుంటున్నారు.