లోకేష్, పవన్ యాత్రలకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఎక్కడ చూసినా వారి యాత్రల గురించే చర్చించుకోనున్నారు. పాదయాత్ర, బస్సు యాత్రలు చేస్తే ఆ ఎఫెక్ట్ జనంలో ఎలా ఉంటుందో జగన్‌కు బాగా తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా కౌంటర్ ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలా ఎలాంటిదన్నది .. కీలకంగా మారింది. వారు యాత్రను ప్రారంభించలేరని .. ఒక వేళ ప్రారంభించినా వెంటనే ఆపేసేలా జగన్ టెక్నిక్ ఉంటుందని చెబుతున్నారు. అందుకు వారు అంచనా వేస్తున్న ప్రధాన కారణం ముందస్తు ఎన్నికలు.
ఇప్పటి వరకూ జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే.. ఏపీలో ప్రభుత్వం ముందస్తు ప్రయత్నాలు చేసుకుంటోందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. గడప గడపకూ.. ప్రోగ్రాంతో పాటు సీఎం జిల్లాల పర్యటనలూ ఈ కోణంలోనే ఉన్నాయి. ఇప్పటికే హామీలన్నీ పూర్తి చేసేసేశామని చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రాజధానులు.. సంక్షేమం ఎజెండాగా ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి రాను రాను టైట్‌గా మారుతోంది. ఆదాయం పెరగడం లేదు కానీ ఖర్చులు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం కష్టమని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు.
ప్రస్తుతం వైసీపీ అధినేత చేస్తున్న కసరత్తు ఆ దిశగానే ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. బహుశా.. యువనేతలిద్దరి టూర్లు.. ప్రారంభించగానే.. ముగించేయడానికి జగన్ ముందస్తు ప్రకటనతో ప్లాన్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బహుశా .. మార్చిలో అసెంబ్లీని రద్దు చేయవచ్చని ఇప్పటికే ఓ నమ్మకం వైసీపీలోనూ ఉంది.