విజయవాడలో కార్పొరేటర్లు వరుసగా పార్టీ మారిపోతూండటంతో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పీఠానికి ఎసరు వచ్చి పడింది. అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను దింపేయాలని విపక్ష పార్టీలకు చెందిన వారు.. సొంతపార్టీ కార్పొరేటర్లు కూడా ఓ అవగాహనకు వస్తున్నారన్న ప్రచారం జరుగుతూండటంతో జగన్ వారితో మాట్లాడాలనుకున్నారు. బుధవారం తనను కలవాలని కార్పొరేటర్లు, విజయవాడ నేతలకు సమాచారం ఇచ్చారు.
భేటీలో జగన్ కార్పొరేటర్లను మోటివేట్ చేయనునున్నారు. పార్టీ మారొద్దని మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పనున్నారు. విజయవాడ కార్పొరేషన్ లో మొత్తం 64 డివిజన్లు ఉండగా.. వైసీపీ 49 గెల్చుకుంది. కానీ ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత దాదాపుగా పది మంది పార్టీ మారిపోయారు. కొంత మంది పార్టీ మారలేదు కానీ.. కూటమి నేతలతో కలిసి తిరుగుతూ పనులు చేయించుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు వైసీపీకి ఇరవై మంది కార్పొరేటర్లు కూడా ఉంటారో లేరో చెప్పడం కష్టమన్న వాదన ఉంది. ప్రస్తుత మేయర్ తీరు సగం మంది కార్పొరేటర్లకు సరిపడటం లేదు.
ఉపఎన్నికల్లో పరువు పోవడంతో విజయవాడ మేయర్ సీటును అయినా కాపాడుకోవాలని జగన్ భావిస్తున్నారు. అందుకే బంపర్ ఆఫర్లు ఇస్తామని.. టీడీపీ వైపు చూడొద్దని ఆయన కోరుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణుల అనుచరులే ఎక్కువ. అయితే వీరు కూడా డబుల్ గేమ్ ప్లే చేస్తున్నారన్న అనుమానాలు వైసీపీలోనూ ఉన్నాయి. విజయవాడ కార్పొరేషన్ లో కూటమి సభ్యులు ఎప్పుడైనా అవిశ్వాసం పెడితే మాత్రం రాజకీయం. జోరుగా సాగే అవకాశం ఉంది.