ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన విశేషాలను వివరించేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఏపీలో ఇటీవల పరిణామాలతో పాటు అమరావతిలో కట్టిన వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆలయం టీటీడీ నిర్మించింది.. టీటీడీ చైర్మన్ గవర్నర్ ను ఆహ్వానిస్తారు. స్వయంగా సీఎం ఆహ్వానించేదేమీ ఉండదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
సీఎం జగన్ దావోస్ నుంచి వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాలను కలిశారు. అక్కడ పలు రాజకీయ అంశాలపై చర్చలు జరిగాయని చెబుతున్నారు. దీనికి కొనసాగింపుగా గవర్నర్‌తోనూ సీఎం జగన్ చర్చలు జరిపారని చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు ఇతర కీలకమైన అంశాలపై చర్చింనట్లుగా తెలుస్తోంది. ఇటీవల ముందస్తు ఎన్నికలపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. బీజేపీ అనుమతిస్తే ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని ఉంటున్నారు.
గతంలో కేసీఆర్ ఇలా ముందస్తుకు వెళ్లినప్పుడు ఎవరితోనూ పెద్దగా చర్చించలేదు. కానీ కేంద్ర నాయకులతో టచ్‌లో ఉన్నారు. అక్కడ మాట్లాడుకున్నారు.. ఇక్కడకు వచ్చి.. గవర్నర్‌కు అసెంబ్లీ రద్దు లేఖ సమర్పించారు. గంటలోనే గెజిట్ వెచ్చేసింది. క్షణాల్లోనే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ సారి జగన్ కూడా అలాంటి ఫార్ములా ఏదైనా ఫాలో చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఏదైనా హఠాత్తుగా చేస్తారని… ఊహించని విధంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని అనేక అంశాల్లో స్పష్టమయింది. మరి ఈ సారి అలాంటిదేమైనా ఉందో లేదో చూడాలి !