జగన్ రెడ్డి ఒకటి నుంచి ప్రారంభించాలి.ఇంకా చెప్పాలంటే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి మైనస్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ్నుంచి ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆయన డైరక్ట్‌గా వందకే వెళ్లిపోదాం..రెడీగా ఉండండని పార్టీ నేతలకు చెబుతున్నారు. వాళ్లకే పరీక్షలు పెడుతున్నాడు. ఎన్నికలకు రెడీ అవ్వాలని.. ఎంత బాగా రెడీ అవుతారో వారికి ర్యాంకులు కూడా ఉంటాయని.. ప్రతిఫలం కూడా ఉంటుందని ఆశ పెడుతున్నారు.
వీకెండ్‌కు బెంగళూరు వెళ్లే ముందు పార్టీ ముఖ్యనేతలతో తాడేపల్లిలో జగన్ సమావేశం అయ్యారు. ఎప్పట్లాగే తన పాత స్క్రిప్టునంతటిని చెప్పారు. అదే సమయంలో ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. జమిలీ అంటున్నారని.. ఎన్నికలకు రెడీ అవ్వాలన్నారు. జగన్ మర్చిపోయారో ఆయనకు జమిలీ అంటే తెలియదో కానీ.. మొన్న జరిగింది ఏపీకి సంబంధించినంత వరకూ జమిలీ ఎన్నికలే. మళ్లీ జరిగితే అదే సమయంలో జరుగుతాయి కానీ ముందు జరగవు. ఇంకా కావాలంటే.. కాస్త పొడిగింపు ఇస్తారు. కానీ జగన్ మాత్రం జమలీ ఎన్నికలంటే ముందస్తు ఎన్నికలు అనుకుంటున్నారు.
ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం అంటే జగన్ .. పార్టీ కార్యకర్తల్ని, నేతల్ని ఆశ పెట్టి రోడ్ల మీదకు పంపడం అనుకుంటున్నారు. ఆయన కోసం పదేళ్ల పాటు తిరిగిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్లీ అధికారం పోయాక వారికి తాయిలాలు ఆశ చూపిస్తున్నారు. ఆ తాయిలాలు కూడా మళ్లీ గెలిచిన తర్వాత ఇస్తారట. మత్తంగా జగన్.. అప్పుడే ఎన్నికల్ని కలవరించడం వైసీపీ నేతలకు కూడా వింతగా ఉంది.