ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో లాక్ డౌన్ ఎత్తివేతను కోరుకుంటున్నారు. ఈ విషయం కాస్త నేరుగా.. మరికాస్త పరోక్షంగా నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకే చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా కరోనా లేదన్నట్లుగా జగన్ చెప్పారంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో 676 మండలాలు ఉంటే.. అందుకే.. కేవలం.. 37 మండలాలు మాత్రమే.. వైరస్ సోకి.. రెడ్ జోన్లో ఉన్నాయి. అంటే.. ఐదు శాతం మండలాల్లో కూడా.. ఆంధ్రలో వైరస్ లేదని .. సీఎం .. ప్రధానికి నివేదించారు. రెడ్ జోన్లో ఉన్న 37 కాక.. 44 మండలాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయని వివరించారు.
వీటిలోనూ వైరస్ వ్యాప్తి ఉన్నా.. అంత తీవ్రంగా లేదని.. సీఎం అభిప్రాయం. అంటే.. మొత్తం 676 మండలాల్లో 81 మండలాలు రెడ్‌జోన్, ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. మిగతా 595 మండలాలు గ్రీన్జోన్లో ఉన్నాయి, కరోనా ప్రభావం వీటిపై లేదు:కాబట్టి… రెడ్జోన్లకే లాక్డౌన్ పరిమితం చేయాలని నరేంద్రమోడీకి తెలిపారు జగన్మోహన్ రెడ్డి. ఒక వేళ రెడ్ జోన్లకే… లాక్ డౌన్ పరిమితం చేయాలని ప్రభుత్వం అనుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 37 మండలాల్లో మాత్రమే… లాక్ డౌన్ ఉంటుంది. మిగతా ఎక్కడా.. ఉండదు.మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించి జాగ్రత్తలు తీసుకోవచ్చని జగన్ చెబుతున్నారు.
అదే సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. తాము ఎదుర్కోవడానికి ఆస్పత్రులను సిద్ధం చేసుకున్నామని జగన్ ప్రధానమంత్రికి తెలిపారు. కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా దేవుడి దయవల్ల అడ్డుకోగలుగుతున్నామని..చెప్పుకొచ్చారు. చివరిగా ప్రధానమంత్రి ఏం చెబితే అది చేస్తామని చెప్పినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి ఏపీలో కరోనా ప్రభావం తీవ్రంగా లేదన్న అభిప్రాయాన్ని కల్పించడానికి ప్రయత్నించినట్లు స్పష్టమయింది.