ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఓ చరిత్రాత్మక బిల్లును ఆమోదించింది. స్కూల్ ఫీజులు నియంత్రించడమే కాదు.. అసలు విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఏపీ సర్కార్ ఓ కొత్త బిల్లును ఆమోదించారు. ఆ బిల్లు పేరు ” ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ బిల్..”. విద్యావ్యవస్థను.. ప్రక్షాళించి తీరుతామని.. జగన్మోహన్ రెడ్డి … ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి చెబుతున్నారు. దాని లో భాగంగా… కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఇప్పటి వరకూ.. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు… ఓ కమిటీ మాత్రమే ఉండేది. ఆ కమిటీని రద్దు చేసేసి… కొత్త పవర్ ఫుల్ వ్యవస్థను తీసుకు వచ్చేలా.. బిల్లును ఆమోదించారు.
ఇక ఏపీలో ఫీజులు స్కూళ్లు కాలేజీలు నిర్ణయించలేవు..!
ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటటరింగ్ కమిషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో.. ఇక ముందు నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నిర్ణయం కమిషన్ చేతిలోకి వస్తుంది.ఈ కమిషన్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించే రిటైర్డ్ హైకోర్టు జడ్జి చైర్మన్‌గా ఉంటారు. 11 మందిని సభ్యులు ఉంటారు. జాతీయస్థాయిలో ప్రముఖ విద్యా నిపుణులను ఈ కమిషన్‌లో నియమిస్తారు. ఈ కమిషన్ ఏదైనా స్కూలుకు వెళ్లి అక్కడ అడ్మిషన్, టీచింగ్ ప్రక్రియలను పర్యవేక్షించడానికి పూర్తి హక్కు ఉంటుంది. స్కూళ్ల గ్రేడింగ్, విద్యాహక్కు చట్టం అమలు, అక్రిడేషన్ కూడా కమిషన్ పరిధిలోకి వస్తుంది. తప్పులు చేసే యాజమాన్యాలను హెచ్చరించడమే కాదు, జరిమానాలు విధించడం, చివరకు స్కూళ్లను కూడా మూసివేయించే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది. పిల్లల ఫీజులు.. ఎంత మేర ఉండాలనేది కమిషనే నిర్ధారిస్తుంది.
కమిషన్‌పై అధికారం ప్రభుత్వానికి..!
అయితే.. కమిషన్‌కు ఎన్నో అధికారాలు ఇచ్చినప్పటికీ.. కమిషన్ నిర్ణయాలను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి బిల్లు ఇచ్చింది. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య సంఘాలతో సంప్రదింపులు చేసే అధికారం కమిషన్‌కు ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే విద్యా సంస్థలకు జరిమానా విధిస్తుంది. అనుమతుల రద్దుకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే.. ఈ ఆదేశాలను.. ప్రభుత్వం సమీక్షించవచ్చు. కమిషన్‌కు అంత అధికారం ఇచ్చినప్పటికీ.. ఫైనల్‌గా ప్రభుత్వం… తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం ఎందుకు చేసిందనేది.. చాలా మందికి అర్థం కాలేదు…!
ఫీజులపై ఏపీ మొత్తం ఒకే విధానం ఉండదా..?
సాధారణంగా ఫీజులను నియంత్రించాలంటే… ఫలానా తరగతికి.. ఇంత ఫీజు తీసుకోవాలనే విధానాన్ని అమలు చేస్తూంటారు. అయితే.. ప్రస్తుతం.. కాలేజీలు, స్కూళ్ల వారీగా.. ఆయా విద్యాసంస్థలు అమలు చేస్తున్న ఫీజులు సముచితమో.. కాదో.. కమిషన్ నిర్ణయిస్తుందని… బిల్లు చెబుతోంది. దీంతో.. ఏపీలో స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు ఎంత ఉండాలనేది కమిషన్ చేతుల్లో ఉంటుంది. విద్యాసంస్థల వారీగా కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. అంటే… ఒక్కో స్కూల్ లేదా.. కాలేజీకి.. ఒక్కో ఫీజు ఉంటుంది. ఏపీ సర్కార్ చేసిన చట్టం వల్ల అయినా.. ప్రైవేటు స్కూళ్ల దోపిడికి అడ్డుకట్ట పడితే.. అందరి కంటే ముందు సంతోషించేది..పిల్లల తల్లిదండ్రులే. అందుకోసమే వారు ఎదురు చూస్తున్నారు.