ముఖ్యమంత్రి జగన్ సీఎం అయిన కొత్తలో సమావేశం అయిన మందిరం అయిన ప్రజావేదికను కూల్చేయమని.. అదే అదే మందిరం నుంచి ఆదేశించారు. అది అక్రమ కట్టడం అని ఆయన తేల్చారు.. కానీ అది అక్రమ కట్టడం అని నిరూపించే ఒక్క సాక్ష్యం లేదు కానీ కూల్చేశారు. అదే ఒరవడిని ఆయన అన్ని చోట్లా కొనసాగిస్తున్నారు. కానీ గతంలోలా అమలు చేయలేకపోతున్నారు. ప్రజావేదికను కూల్చేసినట్లుగా అన్నింటినీ కూల్చేయలేకపోతున్నారు. దీనికి తాజా ఉదాహరణ ఫ్లెక్సీల నిషేధ నిర్మయం.
రెండు నెలల కిందట విశాఖ వెళ్లి పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు .. ఆవేశంగా ఇవాళ్టి నుంచే ఫ్లెక్సీల నిషేధం అని ప్రకటించారు. జగన్ ప్రకటించిన ఆ రోజు.. ఇంకా రాలేదు పలు వాయిదా తర్వాత నవంబర్ ఒకటి నుంచి నిషేధం అని జీవో జారీ చేశారు. కానీ నవంబర్ దగ్గరకు వచ్చే సరికి మళ్లీ జనవరి అని మాట మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంటే.. ముఖ్యమంత్రి చెప్పిన మాట… ఇచ్చిన ఆదేశం అమలు చేయాలంటే ఎంత కష్టమో.. ఇప్పుడు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి ప్రకటన తర్వతా ఏళ్ల తరబడి ఫ్లెక్సీ వ్యాపారాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి లక్షల మంది ఆందోళనకు గురయ్యారు. ఫ్లెక్సీలు ప్లాస్టిక్ కాదని వారు చెబుతున్నరు. అవి రీ సైక్లిబుల్గా స్పష్టం చేస్తున్నారు. గుడ్డతో తయారు చేసే ఫ్లెక్సీలు చేసే యంత్రాలకు ఇప్పుడు అదనంగా రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టే పరిస్థితిలో తయారీదారులు లేరు. భారీ ఖర్చు వల్ల డిమాండ్ ఉండదు.
వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టాక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు సరికదా ఇష్టం వచ్చినట్లు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంది. ముఖ్యమంత్రికి నిజంగా పర్యావరణ పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు రాష్ట్రంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి. నివారణా చర్యలు చేపట్టాలి కానీ ఉపాధి పొందుతున్న వారి పొట్ట కొట్టడం ఏమిటన్నది ఎక్కువ మంది వాదన. అయితే జగన్ మైండ్‌లో ఏదనిపిస్తే బ్లైండ్‌గా … ఎవరినైనా సరే తొక్కుకుంటూ వెళ్లిపోతారని వైసీపీ నేతలు గర్వంగా చెబుతూంటారు.