ఏపీ సీఎం జగన్ ఇంగ్లిష్ దినపత్రిక హిందూకు ఇంటర్యూ ఇచ్చారు. సైలెంట్‌గా ఆ పత్రిక ఇంటర్యూను ప్రింట్ చేసింది. ఈ ఇంటర్యూను ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఇంగ్లిష్ పత్రికల్లో సాక్షిగా హిందూను చాలా మంది భావిస్తారు. అమరావతి గురించి హిందూ వెబ్ సైట్లో పోల్ నిర్వహించి.. ఎక్కువ మంది అనుకూలంగా వచ్చే సరికి.. ఆ పోల్‌ను తీసేసిందన్న విమర్శలు కూడా హిందూ ఎదుర్కొంటోంది. ఈ సమయంలో జగన్ మూడు రాజధానుల వాదన వినిపించడానికి ఆ పత్రికలో ఇంటర్యూ వేశారు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా తెలుగులోనూ ఆ పాయింట్లను ప్రసారం చేస్తోంది.
హిందూ ఇంటర్యూలో జగన్ ఇంటర్యూ సారాంశం.. సీఎం ఎక్కడి నుంచి పరిపాలన చేయాలని.. ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారు ? ఎక్కడి నుంచి పరిపాలన చేయాలనేది సీఎం ఇష్టం. సీఎం ఎక్కడ ఉంటే.. మంత్రివర్గం అక్కడ ఉంటుంది. మంత్రి వర్గం ఎక్కడ ఉంటే.. సచివాలయం అక్కడ ఉంటుంది ! అనే. అంటే.. కోర్టుల్ని.. తీర్పుల్ని లెక్క చేయకుండా జగన్ విశాఖ వెళ్లిపోతున్నారని.. తనతో పాటు సచివాలయాన్ని తీసుకెళ్తున్నారని ఈ ఇంటర్యూ ద్వారా చెప్పకనే చెప్పారు. అంత మాత్రం దానికి అసెంబ్లీలో బిల్లులు పెట్టుకుని .. ఉపసంహరించుకుని న్యాయపోరాటాలు చేయడం ఎందుకన్నది ఇప్పుడు అసలైన ప్రశ్న.
అదేదో మూడు రాజధానులు అని బిల్లు పెట్టక ముందే చేసి ఉంటే.. అందరూ నమ్మేవారేమో కానీ.. ఇప్పుడు బిల్లులు పెట్టి.. న్యాయరాజధాని అనేదానికి చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేకపోయినా చేసేసి.. రచ్చ రచ్చ చేసుకుని.. ఇప్పుడు సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అనే వాదన వినిపించడానికి జగన్ సిద్ధమయ్యారు. సీఎం జగన్ విశాఖ వెళ్లకుండా ఎవరూ అడ్డుకోరు. కానీ సెక్రటేరియట్‌ను తరలిస్తామంటే మాత్రం కోర్టు ధిక్కరణే అవుతుంది. మొత్తంగా ఎన్నికలకు ముందు అసలు న పాలన కన్నా.. మూడు రాజధానుల పేరుతో వశాఖలో డ్రామా చేయడానికే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తాజా పరిణామాలతో తెలుస్తోందని విపక్షాలు అంచనా వేస్తున్నాయి.