ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు.. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరో తప్ప.. ఇలా తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అడ్డంగా ఎదురుదాడికి దిగితే.. ఎవరు పట్టించుకుంటారే అనుకుంటున్నారో.. సోషల్ మీడియాలో.. ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడితే.. నిజమని జనం నమ్ముతారని అనుకుంటున్నారేమో కానీ.. విలువలు.. విశ్వసనీయత అనే పదాలకు అర్థం లేకుండా చేస్తున్నారు. దానికి… సన్నబియ్యంపై జగన్ .. ఆయన పార్టీ వాదనే సాక్ష్యం.
సన్నబియ్యం ఇస్తామన్న హామీ రికార్డుల్లో ..!
అధికారంలోకి రాగానే రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆ తర్వాత మొదటి కేబినెట్ భేటీలో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ విషయంలో… కేబినెట్ బ్రీఫింగ్లో కూడా వెల్లడించారు. ఆ తర్వాత వైసీపీ గెజిట్ సాక్షి ప్రకటించింది. సెప్టెంబర్ నుంచే సన్నబియ్యమని.. పోస్టర్లు వేశారు. ప్రభుత్వం సంచులు కూడా రెడీ చేసింది. ఇదంతా రికార్డెడ్. దీన్ని ఎవరూ తోసి పుచ్చలేదు… చెరపలేరు.
హామీ అమలు చేయలేక అబద్దాలు షూరూ..!
సన్నబియ్యం ఇవ్వలేరని… సెప్టెంబర్ దగ్గరకు వచ్చే సరికి ప్రభుత్వానికి క్లారిటీ వచ్చింది. నిజానికి సన్నబియ్యం రేషన్ కార్డులపై ఇవ్వలేరని.. పౌరసరఫరాల శాఖలో ఓ సీనియర్ ఉద్యోగిని అడిగినా చెబుతారు. కానీ నా మాటంటే మాటే అనుకున్న జగన్ ఎవరి మాటా వినిపించుకోలేదు. దాంతో చివరికి చేతులెత్తేయక తప్పలేదు. వెంటనే… మడమ తిప్పేశారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదనే వాదన ప్రారంభించారు. నిజానికి .. సన్నబియ్యం ఉత్పత్తి లేదని..నాణ్యమైన బియ్యం ఇస్తామని.. చెప్పి ఉంటే… నిజాయితీగా ఉండేది. కానీ అడ్డంగా తాము అలాంటి హామీ ఇవ్వడం లేదని వాదించడం ప్రారంభించారు. మంత్రులు బూతులు మాట్లాడి.. విమర్శించడం ప్రారంభించారు. చివరికి జగన్.. అసెంబ్లీలో మరింత దిగజారిపోయారు. తాము మేనిఫెస్టోలో పెట్టలేదని.. చెప్పి… అసలు ఆ హామీలు అమలు చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. కానీ.. మేనిఫెస్టోలో పెట్టినవి మాత్రమే కాదు.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే.. మాట తప్పకపోవడం. కానీ జగన్.. అడ్డంగా అబద్దాలతో వాదిస్తున్నారు. ఈ క్రమంలో సాక్షి పత్రికపైనా.., ఓ నింద వేసేశారు.
మోసం చేస్తోంది ప్రతిపక్షాన్ని కాదు ప్రజలని..!
సన్నబియ్యం హామీ ఇవ్వలేదని.. రకరకాల పద్దతుల్లో వాదిస్తున్న వైసీపీ.. ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి.. గట్టిగా సమాధానం చెబుతున్నాననుకుంటోంది. ఆ పార్టీకి తిట్టి.. నోరెత్తకుండా చేస్తున్నామనుకుంటోంది. కానీ.. నిజానికి వారు ఎదురుదాడికి దిగుతోంది ప్రజలపైనే. సన్నబియ్యం ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి.. ఇలా.. ఒక్క సారిగా.. మాట మార్చి.. బూతులు లంకించుకోవడం.. వారిని విస్మయపరుస్తోంది. ఇంత కాలం చెప్పిన మాట తప్పడం.. మడమ తిప్పడం అనే పదానికి అర్థాలు ఇవేనా అవి విస్మయం చెందాల్సి వస్తోంది. సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం .. నాణ్యమైనబియ్యంగా మారింది.. అదీ కూడా ఏప్రిల్కు మారింది. అప్పుడు కూడా ఇస్తారో లేదో.. అప్పుడు కూడా.. మీ అమ్మ మొగుడు చెప్పాడా.. అని ఎదురుదాడికి దిగుతారో..ఊహించడం కష్టం.,
సన్నబియ్యం హామీ ఇచ్చాము కానీ.. సాధ్యం కావడం లేదని.. అంతే క్వాలిటీగా నాణ్యమైన బియ్యం ఇస్తామని.. జగన్ నిజాయితీగా చెప్పి.. పథకాన్ని అమలు చేసి ఉంటే.. ప్రజల్లో మంచి స్పందన ఉండేది. నిజాయితీగా చెప్పారనే సానుభూతి కూడా ఉండేది. కానీ ఇప్పుడు.. వైసీపీ నేతలు చేస్తున్న ఎదురుదాడి.. ప్రజల్లోనూ… వ్యతిరేకతకు కారణం అవుతోంది. అందుకే జగన్.. సన్నబియ్యంపై కాలేశారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.