” ఈ సారి గెలిస్తే 30 ఏళ్లు మనమే.. నియోజకవర్గాల సమీక్షల పేరుతో ఎంపిక చేసిన యాభై మందిని తాడేపల్లికి తీసుకు వచ్చి జగన్ చెప్పే మాట ఇది. వై నాట్ 175 అంటూ ప్రారంభిస్తారు. మనం సగం ఇళ్లకు పథకాలు అందిస్తున్నాం.. వారందరూ ఓట్లు వేస్తారు… అందుకే గెలిచేస్తాం.. కానీ కష్టపడాల్సింది మీరు.. నేను మీటను సరిగ్గా నొక్కాలి ” అంటూ జగన్ ముగిస్తున్నారు. ముందుగానే ఐ ప్యాక్ టీం సిద్ధం చేసిన నివేదిక ప్రకారం.. అందరూ కలిసి పని చేయాలని చెప్పడం..ఆ నియోజకవర్గంలో టిక్కెట్ ఆశించే వారు ఉంటే వారకి ఏదో పదవి ఇస్తామని ఆఫర్ చేయడం మినహా.. వారి సమస్యలు వినే ప్రయత్నం కూడా చేయడం లేదు.
నియోజకవర్గం మొత్తం మీద యాబై మంది మాత్రమే కీలక నేతలంటూ పిలుస్తున్నారు. వారిలోనూ ప్రభుత్వం తరపున పనులు చేసి బిల్లులు రాని వాళ్లుంటే పక్కన పెట్టేస్తున్నారు. వచ్చే వారికీ మాట్లాడే చాన్స్ ఇవ్వడం లేదు. ఎవరైనా సమస్యలు చెప్పబోతే.. సీఎంవో అధికారుల వైపు చూసి వెంటనే పరిష్కరించండి అని సీఎం ఆదేశిస్తున్నారు. అసలు సమస్య ఏమిటో కూడా పూర్తిగా వినడం లేదే అని నియోజకవర్గ నేతలు ఫీలవుతున్నారు. అయితే జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఏ నియోజకవర్గ సమీక్ష అయినా ఒకటే ఆవు కథ చెబుతూండటంతో.. పార్టీ నేతలకూ ఈ సమీక్షలపై ఆసక్తి పోతోంది.
రాజకీయాల్లో రేపేం జరుగుతుందో చెప్పడం కష్టం. అలాంటిది.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ముఫ్పై ఏళ్లు అంటూ జగన్ పగటి కల కంటూ… ఈ సారి గెలిపించే బాధ్యత మీదేనంటూ.. నియోజకవర్గ నేతలపై బాధ్యత పెట్టడం చాలా మందికి నచ్చడం లేదు. పార్టీ క్యాడర్లో ఇప్పటికే ఉత్సాహం తగ్గిపోయింది. వారికీ పాలన వల్ల ప్రయోజనం ఉండటం లేదు. ఈ క్రమంలో జగన్ నియోజకవర్గ సమీక్షల్లో మార్పులు చేయాలని..క్యాడర్ సమస్యలను ఎక్కువగా వినాలన్న అభిప్రాయం ఆ పార్టలో వినిపిస్తోంది. కానీ బయట సామాన్య ప్రజలను మాట్లాడకుండా చేసినట్లే.. అంతర్గత సమావేశాల్లో .., సమస్యలు లేవనెత్తుతారనుకున్న పార్టీ నేతలకు మైక్ అందించడం మానేశారు.