వ్యక్తిగత వ్యవహారాలతో ప్రియుళ్ల చేతిలో హత్యలకు గురైన యువతుల కుటుంబాలను కలిసి రాజకీయం చేసేందుకు వెళ్లిన జగన్ రెడ్డి ప్రెస్మీట్లలో వారంతా నా చెల్లెళ్లు.. నా సొంత చెల్లెళ్లు అని చెప్పుకుంటున్నారు.. ఓ వైపు సొంత తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లి ఇలా రాజకీయం కోసం నా సొంత చెల్లికి అన్యాయమైపోయిందని వాళ్లను కూడా రోడ్డునపడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఆయన పెడుతున్న ప్రెస్మీట్లలో ఒక్కటే మార్పు కనిపిస్తోంది. అదేమిటంటే గతంలో దేనికైనా చంద్రబాబు అనేవారు.. ఇప్పుడు లోకేష్ అంటున్నారు.
లోకేష్ ఇమేజ్ను నాశనం చేసేందుకు జగన్ రెడ్డి వందల కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడయాను నడిపారు. ఇప్పుడు లోకేష్ ఆ దాడుల్ని ఎదుర్కొని ఏకుమేకైపోయారు. ఎప్పుడు ఏ వైపు నుంచి తమపై రాజకీయ దాడి చేస్తాడో వైసీపీ నేతలకు ఊహకు అందడం లేదు. అందుకే లోకేష్..లోకేష్ అని కలవరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో మాటకు ముందు చంద్రబాబు…. ఆ తర్వాత చంద్రబాబు అనే వారు. ఇప్పుడు చంద్రబాబు ప్లేస్ లోకి లోకేష్‌ను తెచ్చుకుని తన భయాన్నంతా బయట పెట్టుకుంటున్నారు.
చంద్రబాబులా కాదు నారా లోకేష్. చట్టపరంగా అయినా అవినీతిపై శరవేగంగా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. లోకేష్ ఎంత పద్దతిగా చేస్తున్నారో ఆ చురుకుదనమేంటో మెల్లగా వైసీపీ నేతలకే కాదు జగన్‌కూ అర్థమవుతోంది. అందుకే లోకేష్ జపం ప్రారంభించారు.