ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం జనాలను వెర్రివాళ్ళను చేయడమే.అక్రమాస్తుల కేసులో బెయిల్ పొందేందుకు వైఎస్సార్ పేరును కూడా సీబీఐ చార్జీషీట్ లో చేర్పించిన ఘనుడు జగన్ అని, అధికారం కోసం సొంత చిన్నాన్న హత్యను కూడా వాడుకున్నాడని షర్మిల పలు విషయాలను బయటపెడుతున్నారు. అయినా షర్మిలను జనం విశ్వసించరని…తను చెప్తున్నా మాటలనే పరిగణనలోకి తీసుకుంటారని జగన్ అంచనా వేస్తుండటం జనాలను అవమానించడమే.
షర్మిల వాయిస్ ను జనాల్లోకి వెళ్ళకుండా మీడియాను మేనేజ్ చేస్తోన్న జగన్ ప్రజలను కూడా అమాయకులుగా భావిస్తున్నారు. జగన్ సీఎం అయ్యేందుకు అహర్నిశలు శ్రమించిన షర్మిలకు పసుపు ట్యాగ్ పూసేశారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఎందుకు వెనకేసుకోస్తున్నారన్న ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం బాకీ పడే ఉన్నారు. ఇలా పలు విషయాలపై ఆమె ఆధారాలతో మాట్లాడుతోన్నా వాటికి సమాధానం ఇవ్వకుండా చంద్రబాబు కోవర్ట్ అంటూ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు.
తన రాజకీయంతో సొంత చెల్లినే అపఖ్యాతి పాలు చేస్తోన్న జగన్ రెడ్డి ప్రజలను అమాయకులుగా భావిస్తారని అనుకోవడంలో అతిశయోక్తి లేదు.తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పిచ్చిగా జనాలు తనను ఆదరిస్తారనే జగన్ నమ్మకం ప్రజలను అమాయకులుగా భావించడమే. పాలకుల మనస్తత్వం ఇలా ఉండటం వ్యవస్థలకే కాదు… ప్రజలకు కూడా ఏమాత్రం శ్రేయస్కరం కాదు.