మాజీ సీఎం జగన్ మరో ఓదార్పు యాత్రకు రెడీ అవుతున్నారా…? ఎమ్మెల్సీలతో భేటీ తర్వాత నేతలందరూ అవుననే అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత జగన్ తాడేపల్లి నివాసానికే పరిమితం అయ్యారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం పిలిచేందుకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఓడిన నేతలతో ఓసారి మీటింగ్ నిర్వహించారని ఆయన పీఆర్ టీం వీడియోలివ్వగా, తాజాగా ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.
కేవలం 11మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష నేత హోదాను కూడా కోల్పోయారు. అసెంబ్లీలో వార్ వన్ సైడ్ అని తెలియటంతో… మెజారిటీ ఉన్న మండలిపై ఫోకస్ చేశారు. కొత్త ప్రభుత్వం హానీమూన్ లో ఉందని… టైం ఇద్దామని చెప్తూనే కీలక వ్యాఖ్యలు చేశారు.
తను గతంలో 16నెలలు పాదయాత్ర చేశానని… ఆ వయస్సు ఇంకా తనకు ఉందన్నారు. రాష్ట్రం రావణకాష్టం అవుతోందని, ఎన్నికల తర్వాత వైసీపీకి ఓటేశారన్న ఉద్దేశంతో గొడవలు జరుగుతున్నాయని…ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, అలాంటి వారిని పరామర్శించాల్సిన అవసరం ఉందంటూ ఓదార్పు యాత్రపై హింట్ ఇచ్చారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో పరామర్శలకు వెళ్లిన ఇప్పుడు మరోసాకు వెతుక్కొని యాత్రకు రెడీ అవుతున్నారని, కానీ జగన్ వేషాలను జనం నమ్మే పరిస్థితి లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. జగన్ పాలనలో వైసీపీ రౌడీరాజ్యం చూశాక… జగన్ చెప్పే కారణాలను రాజకీయంగానే చూస్తారు తప్పా సెంటిమెంట్ గా తీసుకోరని స్పష్టం చేస్తున్నారు.