హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్‌రావు, స్టీఫెన్సన్లను ఒక హోటల్లో కలిసి ఓటుకు నోటు కేసుకోసం కుట్రపన్నారని, స్టీఫెన్సన్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కేసీఆర్‌కు లేఖ ఇచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌కు లేఖ ఇచ్చారన్న మంత్రి అచ్చెన్నాయుడు ఆ లేఖను చూపితే, హరీష్ రావును కలిశానని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, చూపలేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఛాలెంజ్…ఛాలెంజ్…ఛాలెంజ్ అంటూ మూడుసార్లు పెద్ద పెద్దగా కేకలు పెట్టారు. ఆయన అరుపులకు సభలో అందరూ నివ్వెరపోయారు. ఇంకా నయం… రేవంత్ రెడ్డికి డబ్బు మూటలిచ్చి పంపించాననికూడా అనలేదని జగన్ ఎద్దేవా చేశారు. స్టీఫెన్సన్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. కేసులు తప్పించుకునేందుకు మోడిముందు సాష్టాంగపడ్డారని అన్నారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ, అచ్చెన్నాయుడు-జగన్ సవాళ్ళు విసురుకుని తనను రాజీనామా చేయమని అనటమేమిటని ఆశ్చర్యపడ్డారు(పాపం!) జగన్‌కు మానసికవ్యాధి ఉందని అన్నారు. తనను బీట్ చేసి అర్జెంట్‌గా మహానాయకుడు కావాలని జగన్ కలలు కంటున్నారని విమర్శించారు.