విశాఖలో కొత్తగా ఎన్ ఐఏ కోర్టు ఏర్పాటు చేశారు. విశాఖలో జరిగిన కోడికత్తి కేసు కాబట్టి ఆ కేసును అక్కడికి న్యాయమూర్తి బదిలీ చేశారు. ఇక నుంచి విశాఖలో ఆ కేస విచారణ జరుగుతోంది. ప్రస్తుతం కోడికత్తి శీను బెయిల్ పిటిషన్… వ్యక్తిగతంగా హాజరు కాలేనని జగన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పెండింగ్ లో ఉన్నాయి. కోడికత్తి గాయం కంటే లోతుగా దర్యాప్తు చేయాలన్నట్లుగా గతంలో జగన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ ను ఇప్పటికే కోర్టు కొట్టి వేసింది.
దాదాపుగా ఐదేళ్లుగా కోడికత్తి శీను జైల్లో మగ్గుతున్నారు. ఆయన తల్లిదండ్రులు మథనపడుతున్నారు. హత్యలు చేసిన అనంతబాబు లాంటి వాళ్లు బయట హాయిగా తిరుగుతున్నారని.. తమ బిడ్డ ఏమీ తప్పు చేయకపోయినా ఎందుకు ఇన్నాళ్లు జైల్లో పెట్టారని వారు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వొచ్చని జగన్ రెడ్డి ఒక్క లెటర్ ఇస్తే చాలని అనుకుటున్నారు. కానీ అలా ఇచ్చే పరిస్థితి లేదు. పైగా లోతైన విచారణ పేరుతో ఆయనను జైల్లోనే మగ్గించేలా చేస్తున్నారు.
మరో వైపు జగన్ రెడ్డి తానే బాధితుడు అయినప్పటికీ న్యాయం కోసం కోర్టుకు హాజరయ్యేది లేదంటున్నారు. ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ఐఏ కోర్టుకు రావడానికి ఆయన సాకులు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని అంటున్నారు. ఇప్పుడు కోర్టు అంగీకరిస్తుందోలేదో లేదో తెలియదు. ఇలా అంగీకరిస్తే ఎక్కువ మంది అదే ఆప్షన్ కోసం పిటిషన్లు దాఖలు చేస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక వేళ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకపోతే.. జగన్ రెడ్డి తాడేపల్లి టు విశాఖకు అయ్యే ఖర్చు ప్రజల ఖాతాలో రాసుకోవాల్సిందే. గతంలో సీబీఐకేసుల్లో విచారణకు హాజరవ్వాలంటే … రోజుకు ప్రజలకు రూ. అరవై లక్షల ఖర్చవుతుదంని లెక్క చెప్పారు. మరి ఈ సారి ఎంత అవుతుందో ?