వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయవాద క్యాంప్ చాలా బిజీగా ఉంది. వచ్చే శుక్రవారం.. కోర్టుకు హాజరవ్వాలా..? అవ్వకపోతే.. కోర్టుకు ఏం చెప్పాలన్నదానిపై.. పాత కేసులు.. ఢిల్లీ స్థాయి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికిప్పుడు హైకోర్టులో.. పిటిషన్ వేసే అవకాశం లేదు. ఎందుకంటే.. గతంలో పాదయాత్రకు వెళ్తున్న సమయంలో.. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ ను వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను సీబీఐ కోర్టుకొట్టి వేసింది. అప్పుడు ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా కొట్టివేసింది. మొన్నటి విచారణలో… దీన్ని గుర్తు చేసిన సీబీఐ కోర్టు.. నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసుకోవచ్చని సూచించింది.
అయితే ఇప్పటి వరకూ.. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన కూడా.. జగన్ న్యాయవాదులు చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై చర్చలు జరుపుతున్నారు. ఒక వేళ జగన్ కోర్టుకు హాజరయితే.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. కోర్టుకు నిందితుడిగా హాజరబోతున్న మూడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారు . మొదటి స్థానం ప్రస్తుతం జైల్లో ఉన్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ది కాగా.. రెండో స్థానం జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాది. వాళ్లిద్దరూ.. సీఎంగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి జైలుకెళ్లారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క సీఎం కూడా.. జగన్ లాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. చరిత్రలో తొలిసారిగా అవినీతి, ఆరోపణలతో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో ఒక ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. నైతికంగా.. ముఖ్యమంత్రిగా ఉండి కోర్టుకు హాజరు కావడం కరెక్ట్ కాదన్న వాదన ఉంది. ముఖ్యమంత్రి స్థానాన్ని అపవిత్రం చేశారన్న విమర్శలు కూడా వస్తాయి. దాంతో జగన్ .. శుక్రవారం ఏం చేయబోతున్నారన్న చర్చ ప్రారంభమయింది.