ఏదైనా చేయాలనుకుంటే చిత్తశుద్ధి ఉండాలి. చేసే పని వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని నమ్మకం కలిగించాలి. కానీ జగన్ రెడ్డి చేసే పనులు మాత్రం భిన్నంగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు ఉపయోగపడేలా ఇవ్వాల్సిన ట్యాబ్స్‌ను.. పరీక్షలకు ముందు తన పుట్టిన రోజు సందర్భంగా పంపిణీ చేస్తున్నారు. ట్యాబ్స్ వల్ల పిల్లలు దారి తప్పుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో పరీక్షలకు ముందు ఈ ట్యాబ్స్ ను వందలకోట్లు ఖర్చు పెట్టి పంపిణీ చేస్తున్నారు.
ఈ ట్యాబ్స్ లో బైజూస్ కంటెంట్ ఉంటుంది. కానీ అది ఏ మాత్రం ఉపయోగపడదని టీచర్లు చెబుతున్నారు. బైజూస్ కంటెంట్, స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాలతో గందరగోళంగా మారుతోంది. ఎక్కువ మంది ట్యాబ్స్ ను వినియోగించుకోవడం లేదు. విద్యా నిపుణులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. అయినా పరీక్షలకు ముందు పంపిణీ చేయడం ఏమిటన్నది అందర్నీ విస్మయ పరిచే అంశం. ఏదో ఇస్తున్నామని.. ఓట్లు వేయండని కోరడానికి తప్ప ఇంకెందుకు పనికి రావని చెబుతున్నారు.
చిత్తశుద్ధి లేని శివపూజలు చేసినట్లు ఏపీలో విద్యారంగంలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. టోఫెల్, ఐబీ, సీబీఎస్ఈ, బైజూస్ అంటే.. నానా తిప్పలు పెడుతున్నారు ఇంగ్లిష్ మీడియం పేరుతో సగం మంది పేద ప్రజల పిల్లలను ఇప్పటికే చదువుకు దూరం చేశారన్న విమర్శలు ఉన్నాయి.