వైసీపీ అధినేత జగన్ బెంగళూరు నుంచి లండన్ వెళ్లారు. ఇక లండన్ వేదికగా రాజకీయాలు చేయనున్నారు. ఆయన ఇక తన శవ రాజకీయాలు లేదా పథకాలపై గగ్గోలును ట్విట్టర్ లో నే వ్యక్తం చేయనున్నారు. చిన్న కుమార్తె వర్షారెడ్డి లండన్ లో చదువు పూర్తి చేసుకున్నారని.. అక్కడ డిగ్రీ ప్రదాన వేడుకలో పాల్గొనేందుకు వెళ్లాలనుకుంటున్నానని జగన్ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఓడిపోయిన తర్వాత వారి పుట్టిన రోజు వేడుకలకు లండన్ వెళ్లాలని పర్మిషన్ తీసుకున్నారు కానీ పాస్ పోర్టు కోసం .. దిగువకోర్టులో పూచికత్తు సమర్పించాల్సి వస్తుందని ఆగిపోయారు. ఇప్పుడు హైకోర్టుకు వెళ్లి అలాంటి పూచికత్తు అవసరం లేకుండా చేసుకున్నారు.
నిజానికి ఆ సమయంలో కూతుళ్లు ఇద్దరూ ఇక్కడే ఉన్నారని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు బయటకు వచ్చాయి. జగన్ సీఎం అయిన మొదట్లో పెద్ద కుమార్తెను ఫ్రాన్స్ లో చదివేందుకు పంపించారు. చిన్న కుమార్తెను అమెరికా యూనివర్శిటీలో చదివించడానికి స్వయంగా అమెరికా వెళ్లారు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని నోట్రేడామె యూనివర్సిటీలో చేర్పించారు. అక్కడ చదువు పూర్తి అయినప్పుడు గ్రాడ్యూయేషన్ ప్రోగ్రాం జరిగిందో లేదో కానీ జగన్ వెళ్లలేదు. గత ఏడాది షర్మిల తన కుమారుడి గ్రాడ్యూయేషన్ సెర్మనీకి మాత్రం వెళ్లారు. అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత మళ్లీ లండన్ వచ్చి అక్కడి యూనివర్సిటీలో చిన్న కూతుర్ని జగన్ చేర్పించారు. అయితే ఈ పర్యటన అధికారికంగా జరిగిందని ఎప్పుడూ ప్రకటించలేదు.
ఇప్పుడు చిన్న కుమార్తె గ్రాడ్యూయేషన్ కార్యక్రమానికి వెళ్తున్నారు. అమెరికా, లండన్ లో ఐదారేళ్ల పాటు చిన్నకుమార్తె చదవగా.. పెద్ద కుమార్తె… ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్ లో ఆరేడేళ్లుగా చదువుతున్నారు. పెద్దకుమార్తె గ్రాడ్యూయేషన్ కార్యక్రమానికి కూడా జగన్ వెళ్లలేదు. కొద్ది రోజుల పాటు జగన్ లండన్ లో ఉంటారు. ఎన్ని రోజులు అన్నదానిపై స్పష్టత లేదు. నెలాఖరులో రావొచ్చని అంటున్నారు. కోర్టు అనుమతి ఇచ్చినన్ని రోజులు మాత్రం లండన్ లో ఉండాలి. ఎక్కువ రోజులు ఉంటే.. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్లవుతుంది.