ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలులో సాంకేతిక అడ్డంకులను అధిగమించేందుకు… తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులందరికీ.. భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతో .. ప్రారంభించిన రైతు భరోసా పథకం.. నిజంగా సాగు చేసే రైతులందరికీ.. ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో కౌలు రైతులు కూడా ఉన్నారు. కౌలు రైతులకూ.. పెట్టుబడి సాయం … అక్టోబర్ నుంచి అందించనున్నట్లు.. జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రైతులతో సమానంగా కౌలుదారులకు కూడా సాగుతోపాటు ఇతర హక్కులు, ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని విధివిధానాలను వీలయినంత త్వరగా ఖరారు చేయాలని వ్యవసాయ, రెవెన్యూశాఖలను ఆదేశించారు.
జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కనీసం ఆరు లక్షల మంది కౌలుదారులకు రైతు భరోసా కింద పంటపెట్టుబడి సాయం అందనుంది. రెవెన్యూ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఆరు లక్షల మంది కౌలు రైతులున్నారు. గతంలో 4.33 లక్షల మంది రైతులకు కౌలు రుణ అర్హత గుర్తింపుకార్డులు జారీ చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1.67 లక్షల మందికి గుర్తింపుకార్డులు జారీ చేశారు. వీటి ద్వారానే కౌలు రైతులను గుర్తించి.. పెట్టుబడి సాయం అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.
రైతు బంధు పథకం ద్వారా.. దేశవ్యాప్త గుర్తిపు తెచ్చుకున్న కేసీఆర్… తన పథకంలో.. కౌలు రైతులకు సాయం చేయలేదు. కౌలు రైతులను గుర్తించడం అసాధ్యమని.. వారికి సాయం చేయం కుదరదని తేల్చి చెప్పారు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. పలువురు … నేతలు… రైతుసంఘాలు కూడా… సమగ్ర సర్వే చేసిన తర్వాత కూడా.. కౌలు రైతులను గుర్తించలేకపోవడం ఏమిటని ప్రశ్నలు కూడా గుప్పించారు. అయినప్పటికీ కేసీఆర్ మనసు మార్చుకోలేదు. కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం అమలు చేసి చూపించాలన్న పట్టుదలతో ఉన్నారు.