జగన్ రెడ్డి లండన్ పర్యటనకు రెడీ అయ్యారు. మామూలుగా అయితే ఆయన మూడో తేదీనే ఫ్లైట్ ఎక్కాల్సింది. కానీ చుట్టుముట్టిన సమస్యలతో ఆయనకు ఏమీ పాలుపోవడం లేదు. దీంతో ఏడో తేదీకి వాయిదా వేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడుకూడా ఆయన లండన్ వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఓ వైపు పార్టీ నేతలు జంపింగ్ కోసం సరైన సమయం కోసం చూస్తున్నారు.. మరో వైపు పార్టీ కీలక నేతలు అరెస్టు భయంతో వణికిపోతున్నారు. హైకోర్టులోనూ వారికి ఊరట లభించకపోవడంతో అరెస్టు చేయడానికి పోలీసులు వెదుకుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దర్ని పట్టుకున్నారు. జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా అందర్నీ అరెస్టు చేయడం ఖాయమే. అరెస్టు చేసిన తర్వాత డ్రామాలు ఆడటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వారికి ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ వినియోగించేసుకున్నారు.
పది నుంచి పదిహేను మంది కీలక నేతలు జైలుకెళ్లపోతున్నారు. వీరంతా జైలుకెళ్లేది అవినీతి కేసుల్లో కాదు. జగన్ రెడ్డి అహాన్ని తృప్తి పరచడానికి… చేసిన దాడుల కేసుల్లో. టీడీపీ ఆఫీసు మీ.. చంద్రబాబు ఇంటి మీద చేసిన దాడుల కేసుల్లో వీరందరూ జైలుకు వెళ్తున్నారు. మామూలుగా అయితే వీరికి ఈ ఆలోచన రాలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ ఫీలయ్యాడని.. సజ్జల రామకృష్ణారెడ్డి అంద్రనీ రెచ్చగొట్టి చేయించిన దాడులు. వారు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు.
తన కోసం ఈ పనులు చేసిన వారు జైలుకెళ్తూంటే.. తానూ లండన్ వెళ్తే బాగుంటుందా అని.. అని జగన్ ఆలోచిస్తారని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. కానీ జగన్ మనస్థత్వం తెలిసిన వాళ్లు మాత్రం.. అలా అనుకునేవాళ్లు పిచ్చోళ్లేనని.. ఆయన లండన్ పోకుండా ఉండరని చాలెంజ్ చేస్తున్నారు.