రైతు భరోసా పథకం డబ్బులు మీట నొక్కి రిలీజ్ చేస్తానంటూ ఆళ్లగడ్డకు సీఎం జగన్ వెళ్తున్నారు. రెండు రోజుల ముందు నుంచే ఆళ్లగడ్డలో పరదాలు కట్టడం ప్రారంభమయింది. అయితే ప్రధాని మోదీ అలాంటి హంగామా ఏమీ లేకుండా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత డబ్బులను ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు. జగన్ బటన్ నొక్కే పథకం పేరు పీఎం కిసాన్ – రైతు భరోసా, ప్రధాని మీట నొక్క పథకం పేరు పీఎం కిసాన్ సమ్మాన్. రెండు వేర్వేరుగా ఉన్నాయి. కానీ డబ్బులు మాత్రం సేమ్. అంటే రెండు పథకాలు ఒకసారే డబ్బులు అన్నమాట.
ఏపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో పథకం ప్రవేశ పెట్టింది. జగన్ రూ. 12500 ఒక్కసారే ఇస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. తీరా అధికారలోకి వచ్చాక.. మాకు ఒక్క సారి వద్దు మూడు సార్లు ఇవ్వాలంటూ రైతులే కోరుతున్నారని మూడు సార్లు ఇస్తామని మాట మార్చారు. మూడు సార్లు ఎందుకంటే..కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ కింద ఏపీ రైతులకు ఇస్తున్న రూ. ఆరు వేలు మూడు విడతల్లో వస్తాయి. అందుకే మూడు విడతలుగా మార్చారన్నమాట. కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా తామే ఇస్తున్నట్లుగా బటన్ నొక్కడానికి ఈ మాట తిప్పడం.
గత మూడేళ్లగా జగన్ ఇదే చేస్తున్నారు. కేంద్రం ఇస్తున్నది రూ. ఆరు వేలు అయితే.. జగన్ సర్కార్ ఇస్తున్నది రూ. ఏడున్నర వేలే. నిజానికి కేంద్ర జాబితాలో లేని రైతులకు ఏపీ సర్కార్ పూర్తి స్థాయిలో పదమూడున్నర వేలు ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. ఒక్క సారి మాత్రం కొంత మొత్తం ఇస్తున్నారు. తర్వాత ఎగ్గొడుతున్నారు. అయితే డబ్బులు కేంద్రానివే.. అయినా.. రాష్ట్ర ఖజానా నుంచి పైసా ఇవ్వకపోయినా.. ఈ పథకానికి బటన్ నొక్కే పేరుతో… సాక్షి పత్రికకు మాత్రం రూ. కోట్ల యాడ్స్ సోమవారం ఖాయంగా వెళ్లనున్నాయి. అందుకే అన్ని పథకాల్లో మొదటి లబ్దిదారు సాక్షి.. జగన్ కుటుంబం కావడం అంటే.