వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు.. చేతికి ఎముక లేనట్లుగా.. ప్రకటించడం మాత్రమే కాదు.. పాలనా పరంగా… కూడా.. ఈ నిర్ణయాలు ఉంటున్నాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ.. ఇంటికి పంపిచేయాలని ఆయన దాదాపుగా నిర్ణయించుకున్నారు. గత నెలలో ఆయన… ఈ తరహా ఉద్యోగాలను… ప్రభుత్వానికి ఇచ్చిన ఔట్ సోర్సింగ్ కంపెనీలపై అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాల్లో కమిషన్లు తీసుకుంటున్నారని మండి పడ్డారు. అయితే.. ఇప్పుడు.. ఆ కంపెనీలపై కోపం.. ఉద్యోగులపై చూపిస్తున్నట్లుగా ఉంది. నెల రోజుల్లో.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న చర్చ సచివాలయంలో జరుగుతోంది.
తాత్కలిక, ఒప్పంద ఉద్యోగులకు నెల గడువు..!
ఏపీ సర్కార్.. బుధవారం… కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవలు నెల రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఇలాంటి ఉత్తర్వులు సహజంగా రావు. తీసేయాలని ఆలోచన వచ్చినప్పుడే వస్తాయి. ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిని.. మరో నెల కొనసాగిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం అంటే.. ఆ నెల తర్వాత వేరే దారి చూసుకోమని అర్థం. ఇప్పటికే.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను ప్రభుత్వం సమీక్షించడం ప్రారంభించిది. ఆ కంపెనీలు ఎవరివి.. ఎంత మందిని ప్రభుత్వ సేవలకు పంపారు.. ఎంత కమిషన్లు తీసుకుంటున్నారో బయటకు తీసుకున్నారు. కొత్తగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించొద్దని ఆదేశించారు కూడా.
అందర్నీ తీసేస్తే పాలన సాగదు..!
నిజానికి.. ఆంధ్రప్రదేశ్లో… ఇప్పుడు… పర్మినెంట్ ఉద్యోగులకు… కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసిపోయారు. ఓ స్థాయి వరకూ… కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారు ప్రభుత్వ వ్యవహారాలు, రోజువారీ వ్యవహారాల్లో కీలకంగా ఉంటున్నారు. ఇలాంటి వారందర్నీ లెక్క తీసి.. ఒక్క సారిగా..ఉద్యోగం నుంచి మాన్పించేస్తే.. ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే… ఏజెన్సీలను మాత్రం రద్దు చేస్తారని… వారిని మాత్రం కొనసాగిస్తారని.. కొంత మంది అధికారులు భావిస్తున్నారు. అదెంత వరకు సాధ్యమో కానీ.. ఇప్పటికైతే.. ఉద్యోగులకు నెల మాత్రమే పొడిగింపు లభించింది.
ఏజెన్సీలపై కోపం.. ఉద్యోగులపై చూపించబోతున్నారా..?
ఎన్నికల ప్రచారం సమయంలో.. పాదయాత్ర సమయంలో.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను.. అర్హత, అనుభవం ఆధారంగా పర్మినెంట్ చేస్తామని… జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల రోజుల్లో.. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. కానీ.. ఊస్టింగ్ ఆర్డర్స్ మాత్రం రెడీ చేశారన్న ఆందోళన.. ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఉద్యోగల జీతాల్లో.. ఏజెన్సీ కమిషన్ తీసుకుంటోందని.. జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఏజెన్సీలపై కోపంతో.. ఇప్పుడు.. ఉద్యోగులకు.. కనీసం జీతం రాకుండా చేస్తారా.. అన్న చర్చ కూడా ప్రారంభమయింది. మొత్తానికి ఏపీలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన మాత్రం ప్రారంభమయింది.