పుంగనూరులో ఏడెళ్ల పసిబిడ్డను ఆయన తండ్రి చేస్తున్న ఫైనాన్స్ వ్యాపారంలో ఏర్పడిన గొడవల వల్ల ప్రత్యర్థులు చంపేశారు. ఆ పాపపై ఎలాంటి అఘాయిత్యం చేయలేదని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించింది. చిన్న గాయం కూడా లేదని ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని గుర్తించారు. అయితే తమ రాజకీయం కోసం జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఆ పాపపై అత్యాచారం చేశారంటూ ప్రచారం ప్రారంభించారు. చనిపోయిన చిన్న పాపను కూడా మనశ్శాంతిగా ఉండనీయడం లేదు. ఎక్కడో కూర్చుని బరితెగింపు మాటలకు బ్రాండ్ అంబాసిడర్లు అయిన నేతలు వీడియోలు చేస్తున్నారు కానీ ఆ కుటుంబం పడే బాధను మాత్రం పట్టించుకోవడం లేదు.
శవాల పునాదుల మీదనే ఓదార్పు యాత్ర తో పార్టీ ఏర్పాటు
జగన్ రెడ్డికి శవం కావాలి. ఆ శవం సాధారణ మరణంతో చనిపోయినా సరే… దానికో ట్విస్టులు అద్దుతారు. అది ఆయన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఉంది. వైఎస్ చనిపోయిన తర్వాత ఉమ్మడి ఏపీలో జరిగిన సహజమరణాలన్నింటికీ జగన్ రెడ్డి తన తండ్రి కోసం చనిపోయారని లెక్కలు రాసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గండికొట్టాలని తండ్రి చచ్చిపోయిన రోజే సంతకాల సేకరణపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిన రోజే ఆయన నిర్ణయించుకుని సజ్జల నేతృత్వంలో శవాల లెక్కలు ప్రారంభించారు. రేషన్ కార్డు, టీవీలుకూడా లేని నిరుపేదలు రోగాలతో చనిపోయే వైఎస్సే కారణం అని లెక్కలు రాసి తండ్రి ఆత్మనూ ప్రశాంతంగా ఉండనీయలేదు. ఆ శవాల పునాదుల మీద పార్టీని నిలబెట్టుకున్నారు. అందుకే ఆయన విపక్షంలో ఉన్నకాలంలో ఎక్కడ శవం కనిపించినా దానికి స్పెషల్ ఎఫెక్టులు జత చేసి… రాజకీయం చేస్తున్నారు. ఆ చనిపోయిన కుటుంబాల బాధ మాత్రం పట్టడం లేదు.
పాలన చేసిన ఐదేళ్లలో ఒక్కర్నీ పరామర్శించలేదే !
జగన్ రెడ్డి శవ రాజకీయం ఆయనకు మేలు చేసింది. కానీ ప్రతీ దానికి అదే రాజకీయం చేస్తే అందరూ అసహ్యించుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో ఎన్ని ఘోరాలు జరిగాయో లెక్కే లేదు. కనీసం ఒక్కదానికి అయినా జగన్ రెడ్డి స్పందించలేదు. కానీ వైసీపీ నేతలు… కార్యకర్తలు చేస్తే మాత్రం కనీసం కేసులు పెడతారా అన్న డౌట్స్ వచ్చేవి. నిలువునా చిన్నారుల్ని కాల్చేసినా దర్జాగా బెయిల్ పై వచ్చే కేసులు నిందితులపై పెట్టేవారు. ఇలాంటి ఘోరమైన పాలన చేసిన ఆయన మళ్లీ ఇప్పుడు శవరాజకీయాలతో తెరపైకి వస్తున్నారు.
శవరాజకీయం ఇక వర్కవుట్ అవ్వడం కష్టమే.. తెలుసుకుంటేనే మేలు !
బాధితులకు అండగా ఉండటం ఎవరైనా ప్రతిపక్ష నేత చేసే పని . కానీ బాధితుల కుటుంబాల పరువు ప్రతిష్టలతో ఆడుకుని రాజకీయం చేసే పనులు జగన్ చేస్తూంటారు . తన స్వార్థం కోసం జరగని తప్పుని పదే పదే ప్రచారం చేసుకుంటారు. ఎవరైనా ఆధారాలు అడిగినా స్పందించలేరు. టీడీపీ వచ్చాక నలభై మంది హత్యకు గురయ్యారంటూ ప్రచారం చేశారు. చివరికి పది పేర్లు ఇవ్వమన్నా ఇవ్వలేకపోయారు. ఇలాంటి రాజకీయాల వల్ల ఆయన పాతాళంలోకి పడిపోయారు. ఇప్పుడు పైన మట్టి వేసుకుంటున్నారు. అంటే… శవరాజకీయమే జగన్, బలహీనత అనుకోవచ్చు.