మార్చిపోతే సెప్టెంబర్ అన్న తరహాలో ఏపీ సీఎం జగన్ రెడ్డి విశాఖ కాపురం వ్యవహారం అటూ ఇటూ మారిపోతోంది. ఇదిగో అదిగో అంటూ … ప్రకటనలు చేస్తూ వస్తున్న జగన్ రెడ్డి వందిమాగధులు ఇప్పుడు ఆ ముహుర్తాన్ని దసరాకు మార్చారు. గతంలో శ్రీకాకుళంలో జరిగిన సభలో తాను సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెడతానని ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు అది అక్టోబర్‌కు మారింది.
రుషికొండకు బోడిగుండు కొట్టించి మరీ .. హోటల్ పేరుతో కట్టించుకున్న సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఇప్పుడు విదేశాల నుంచి ఫర్నీచర్ తెప్పించే పనిలో ఉన్నారు. లోపల ఫినిషింగ్ వర్కులు చేస్తున్నారు దసరా కల్లా పూర్తిగా రెడీ చేయించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లనూ పరిశీలించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో జాగ్రత్తలు చెప్పారు. దానికి తగ్గ ట్లుగా పరదాలు, బారీకేడ్లు ఏర్పాట్లు చేయనున్నారు.
అయితే ఆయన సీఎం క్యాంప్ ఆఫీసును విశాఖకు మార్చుకోవచ్చు కానీ.. రాజధాని కాదు. ఎందుకంటే… రాజధాని అంశం ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది. డిసెంబర్ లో విచారణ జరగాల్సి ఉంది. కోర్టు కేసులు తేలకుండా అంతపురాన్ని తాడేపల్లి నుంచి విశాఖకు మారిస్తే… రాజ్యాంగం, కోర్టులకు ఏ మాత్రం నమ్కకం లేని సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు. అయినా సరే తాను అనుకున్నది చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు.
ఎన్నికలకు ముందు ఎలాగైనా విశాఖకు వెళ్లాలని.. వెళ్లినట్లుగా అయినా అనిపించాలని పట్టుదలగా ఉన్నారు. విపక్షాలు కూడా ఆయన ఇలాంటి పనులు చేస్తేనే మంచిదని అంటున్నయి. మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.