జగన్ కి ఘోరమైన ఫలితాలు రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. చంద్రబాబు ఈ యాక్ట్ ను రద్దు చేస్తూ సంతకం పెట్టారు. మొదటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంతోషపడాల్సిన జగన్ రెడ్డి… ఆ యాక్ట్ రద్దు కాకుండా అడ్డుకుందామని పార్టీ నేతలకు నూరి పోస్తున్నారు.. అసెంబ్లీ సమావశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయనున్నారు. అసెంబ్లీలో పాస్ అయిపోతుంది.. కానీ మండలిలో కూడా ఆమోదం పొందాలి.
మండలిలోనూ ఆమోదం పొంది… రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లాల్సి ఉంటుంది. మండలి ఆమోదం దగ్గరే ఆపేయాలని జగన్ అనుకుంటున్నారు.
శాసనసభలో కూటమికి భారీ మెజార్టీ ఉంది కానీ మండలిలో లేదు. మండలిలో ప్రస్తుతం వైసిపికి మెజార్టీ ఉంది. సీట్ల లెక్కల ప్రకారం చూస్తే మండలిలో రద్దు బిల్లు ఆమోదం పొందే పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు పెడితే మండలిలో ఏ విధంగా అయితే అప్పుడు మెజార్టీ ఉన్న టీడీపీ అడ్డుకుందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లును అలాగే అడ్డుకోవాలని జగన్ అనుకుంటున్నారు.
తాము తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్గా జగన్ మద్దతుగా ఉన్నారు. ప్రజలు వ్యతిరేకించారని తెలిసినా ఆయన ఆ చట్టాన్ని రద్దు కాకుండా చేస్తామంటున్నారు. అయితే ఆ చట్టం వల్ల నష్టం జరిగిందని రద్దు చేస్తే చేసుకోవాలని అనాల్సింది పోయి.. రద్దు కాకుండా చూస్తామనడం మంచి వ్యూహం కాదని.. వైసీపీ పెద్దలు కూడా గింజుకుంటున్నారు.