వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో ఓ గ్రామంలో ఘర్షణల కారణంగా చనిపోయిన లింగమయ్య అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి ఏపీకి వస్తున్నారు. ఆ మరణానికి రాజకీయాలుక సంబంధం లేదు. వ్యక్తిగత గొడవలతో జరిగిన ఘర్షణలో ఆ మరణం చోటు చేసుకుంది. అత్యంత సున్నిత ప్రాంతమైన రాప్తాడుతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఇంత కంటే మంచి అవకాశం దొరకదని అనుకున్నారేమో కానీ జగన్ రెడీ అయిపోయారు. వస్తానని ప్రకటించి ముందస్తుగా ప్లాన్ చేసుకుని.. వస్తున్నారు.
అయితే ఆయన రాక పోక అంతా బెంగళూరు నుంచే జరుగుతుంది. తన యలహంక ప్యాలెస్ కు .. చాలా దగ్గరగా రాప్తాడు నియోజకవర్గం ఉండటంతో అక్కడ్నుంచి వచ్చి రాజకీయం చేసి.. ఫ్యాక్షన్ ను రెచ్చగొట్టి మళ్లీ అక్కడికే వెళ్లిపోతారు. ఫ్రం యలహంక .. టు యలహంక అన్నట్లుగా ఆయన టూర్ సాగనుంది. ఇక నుంచి ఆయన రాయలసీమలో ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే నేరుగా బెంగెళూరు నుంచే వచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి.
తాడేపల్లిలో వైసీపీ ఆఫీసును ఖాళీ చేయడంతో దానికి టు లెట్ బోర్డు పెట్టారు. ఆ ఆఫీసును ప్రభుత్వ ధనంతో క్యాంపు ఆఫీసుగా తీర్చిదిద్దుకున్న తన బిల్డింగ్ లోకి మార్చారు. ఆ క్యాంపు ఆఫీసులోకి ఎవరూ రాకుండా బయట నుంచి వచ్చి పోయేలా మీడియా కాన్ఫరెన్స్ రూమ్ ను నిర్మించారు. సజ్జల వంటి అతి కొద్ది మంది మాత్రమే .. ఆఫీసులోకి వెళ్లగలుగుతారు. జగన్ వచ్చినప్పుడు మాత్రమే వారు వస్తున్నారు. దీంతో వైసీపీ తాడేపల్లి ఆఫీసు ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉంటోంది.